For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హైదరాబాద్‌లో అర్ధరాత్రి రాయ్ లక్ష్మీకి ప్రమాదం: రోడ్డుపై అందరూ చూస్తుండగానే.. పరిస్థితి ఎలా ఉందంటే!

  |

  అప్పుడెప్పుడో తెలుగు సినిమా ద్వారా హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించింది కన్నడ బ్యూటీ రాయ్ లక్ష్మీ. తొలినాళ్లలో యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రల్లో మాత్రమే నటించిన ఈ బ్యూటీ.. రాను రానూ గ్లామర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకుంది. ఫలితంగా బాలీవుడ్‌లోనూ అవకాశాలను అందుకుంటూ పలు చిత్రాల్లో నటించింది. ఇలా అన్ని భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోందీ భామ. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి రాయ్ లక్ష్మీ ప్రమాదానికి గురైంది. దానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే...

  పొట్టి బట్టలతో టాలీవుడ్ పాపులర్ యాంకర్ ఫోటోషూట్ (ఫొటోలు)

  డీసెంట్‌గా పరిచయం అయిన రాయ్ లక్ష్మీ

  డీసెంట్‌గా పరిచయం అయిన రాయ్ లక్ష్మీ

  సీనియర్ హీరో శ్రీకాంత్ నటించిన ‘కాంచనమాల కేబుల్ టీవీ' అనే సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించింది కన్నడ బ్యూటీ రాయ్ లక్ష్మీ. ఇందులో ఆమె చేసింది మంచి పాత్రే అయినా.. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ‘నీకు నాకు' అనే చిన్న సినిమా మాత్రమే చేసి.. టాలీవుడ్‌కు బైబై చెప్పేసింది. అయితే, దక్షిణాదిలోని మిగిలిన భాషల్లో వరుస పెట్టి చిత్రాలు చేసింది.

  బాలీవుడ్‌ పుణ్యమా అని మారిన బ్యూటీ

  బాలీవుడ్‌ పుణ్యమా అని మారిన బ్యూటీ

  తెలుగు సినిమాలకు దూరమైన తర్వాత.. తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో చాలా సినిమాలు చేసింది రాయ్ లక్ష్మీ. అన్ని చోట్లా పలు హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్‌గా మారింది. ఆ సమయంలోనే ‘అకీరా' అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘జూలీ 2' అనే సినిమా చేసి అందాలను ఆరబోసింది. దీంతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది.

  హాట్ హాట్ అందాలతో సెగలు రేపుతున్న ముదురు భామ తనుశ్రీ (ఫొటోలు)

  బాలయ్యతో రీఎంట్రీ.. మెగా హీరోలతో రచ్చ

  బాలయ్యతో రీఎంట్రీ.. మెగా హీరోలతో రచ్చ

  బాలకృష్ణ నటించిన ‘అధినాయకుడు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది రాయ్ లక్ష్మీ. ఆ తర్వాత రవితేజ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘బలుపు' అనే సినిమాలో స్పెషల్ సాంగ్‌ చేసింది. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే పవన్ కల్యాణ్ నటించిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్', మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150'లోనూ ఐటెం సాంగ్స్‌తో అదరగొట్టేసిందామె.

  షర్ట్ బటన్ విప్పేసి షాక్ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్

  ఎప్పుడూ అందులోనే.. హాట్‌గా హల్‌చల్

  ఎప్పుడూ అందులోనే.. హాట్‌గా హల్‌చల్

  రాయ్ లక్ష్మీ సినిమా షూటింగ్‌లు ఉన్నా లేకున్నా చాలా రోజులుగా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ బిజీగా ఉంటోంది. ఇందులో తన కెరీర్‌ గురించిన విషయాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. దీంతో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది.

   అర్ధరాత్రి షూట్.. రాయ్ లక్ష్మీకి ప్రమాదం

  అర్ధరాత్రి షూట్.. రాయ్ లక్ష్మీకి ప్రమాదం

  ప్రస్తుతం రాయ్ లక్ష్మీ ఓ మూవీ చేస్తోంది. దీని కోసం హైదరాబాద్‌ నగరంలో బస చేస్తోంది. ఇక, శనివారం అర్ధరాత్రి బంజారాహిల్స్‌లో జరిగిన చిత్రీకరణలో పాల్గొంది. దీనికి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన ఈ బ్యూటీ.. షూట్‌కు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసింది. అదే సమయంలో తాను ప్రమాదానికి గురైనట్లు వెల్లడించి షాకిచ్చిందీ భామ.

  పర్ఫెక్ట్ వయ్యారాలతో కనువిందు చేస్తున్న శివాని నారాయణన్

   రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘటన

  రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘటన

  రాయ్ లక్ష్మీ శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో జరిగిన చిత్రీకరణలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమెపై కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు షూట్ చేశారు. ఇందులో భాగంగానే నగర రోడ్లపై షూటింగ్ చేస్తున్న సమయంలో ఆమె ఒక్కసారిగా పడిపోయిందట. దీంతో పక్కనే ఉన్న వాళ్లంతా కేకలు వేస్తూ ఆమెను పైకి లేపారని తెలిసింది. వెంటనే ప్యాకప్ చెప్పేసి లక్ష్మీని ఆస్పత్రికి తరలించారని టాక్.

  ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందంటే?

  ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందంటే?

  రాయ్ లక్ష్మీకి షూటింగ్‌లో కింద పడడంతో ఆమె కాళ్లకు చిన్న చిన్న గాయాలు అయ్యాయని తెలుస్తోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ ఫొటోలను షేర్ చేస్తూ.. ‘యాక్షన్ ఎపిసోడ్ చేసినందుకు నాకు లభించిన రిటర్న్ గిఫ్ట్ ఇది' అంటూ పోస్టు పెట్టింది. ‘క్వీన్ ఆఫ్ ఇంజురీస్' అనే క్యాప్షన్ కూడా రాసింది. గతంలోనూ ఆమెకు పలుమార్లు ఇలానే గాయాలు అయ్యాయని గుర్తు చేసింది.

  English summary
  Lakshmi Rai, professionally credited as Raai Laxmi is an Indian film actress and model who predominantly appears in Tamil and Malayalam as well as Telugu and Kannada films. She made her Bollywood debut with the film Julie 2.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X