రాశీ ఖన్నా బర్త్ డే పార్టీ: రచ్చ చేసిన రకుల్, రవితేజ, వరుణ్, తేజు... (ఫోటోస్)

By Bojja Kumar

Recommended Video

రాశీ ఖన్నా బర్త్ డే పార్టీ..! రచ్చ చేసిన రకుల్, రవితేజ | Filmibeat Telugu

వరుస అవకాశాలతో దూసుకెలుతున్న హీరోయిన్ రాశీ ఖన్నా గురువారం 27వ పుట్టినరోజు వేడుక జరుపుకుంది. ఈ వేడుకకు రాశీ ఖన్నాతో ఇండస్ట్రీలో క్లోజ్‌గా ఉండే ఫ్రెండ్స్ అంతా హాజరయ్యారు. రవితేజ, రానా, నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠి తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు. 1990, నవంబర్ 30న రాశీ ఖన్నా జన్మించింది.

ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు రాశీ ఖన్నా విడుదల చేశారు. తన స్నేహితులంతా కలిసి తన పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా మార్చారని, ఇది తన జీవితంలో మరిచిపోలేని పుట్టినరోజు అని రాశీ ఖన్నా తెలిపారు.

 రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్

రాశీ ఖన్నా పుట్టినరోజు వేడుకలో తన క్లోజ్ ఫ్రెండ్ రాశీ ఖన్నా బుగ్గపై ముద్దు పెడుతున్న రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఇద్దరు బ్యూటీస్ ఇండస్ట్రీలోకి దాదాపు ఒకేసారి ఎంటరయ్యారు. అప్పటి నుండే ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు.

మాస్ మహరాజ్ రవితేజ

మాస్ మహరాజ్ రవితేజ

రవితేజతో కలిసి రాశి ఖన్నా రెండు సినిమాలు చేసింది. 2015లో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన బెంగాల్ టైగర్ చిత్రం యావరేజ్ గా నిలిచినా.... ఇటీవల విడుదలైన ‘రాజా ది గ్రేట్' చిత్రం మంచి విజయం సాధించింది.

 రానా, నాగ చైతన్య

రానా, నాగ చైతన్య

రాశీ ఖన్నా బర్త్ డే వేడుకలో అక్కినేని యువహీరో నాగ చైతన్య, టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి.

 నోరూరించే కేక్

నోరూరించే కేక్

రాశీ ఖన్నా బర్త్ డే పార్టీలో నోరూరించే పదార్థాలు వడ్డించారు. ప్రత్యేకంగా తయారు చేసిన కేక్స్, చాక్లెట్స్ తో పాటు స్పెషల్ డ్రింక్స్ కూడా వడ్డించినట్లు సమాచారం.

 సాయి ధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్

రాశీ ఖన్నా పుట్టినరోజు వేడుకలో హీరో సాయి ధరమ్ తేజ్. ఇద్దరూ కలిసి సుప్రీమ్ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

 వరుణ్ తేజ్

వరుణ్ తేజ్

హీరోయిన్ రాశీ ఖన్నా పుట్టినరోజు వేడుకలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రస్తుతం ఈ ఇద్దరూ కలిసి తొలి ప్రేమ అనే సినిమాలో నటిస్తున్నారు. వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

హీరోయిన్ లావణ్య త్రిపాఠి

హీరోయిన్ లావణ్య త్రిపాఠి

ఇండస్ట్రీలో రాశీ ఖన్నాతో చాలా క్లోజ్ గా ఉండే స్టార్లలో లావణ్య త్రిపాఠి ఒకరు. అందుకే తన బెస్ట్ ఫ్రెండ్ పుట్టినరోజు వేడుకకు లావణ్య మిస్ కాకుండా హాజరయ్యారు.

 రాశి ఖన్నా లుక్ అదుర్స్

రాశి ఖన్నా లుక్ అదుర్స్

పుట్టినరోజు వేడుకలో రాశి ఖన్నా లుక్ అదిరిపోయింది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్ ధరించిన రాశీ.... తలపై ఇలా కొమ్ములు పెట్టుకుని డిఫరెంటుగా కనిపించింది.

 రచ్చ రచ్చ చేశారు

రచ్చ రచ్చ చేశారు

రాశీ ఖన్నా పుట్టినరోజు వేడుకలో ఆమె స్నేహితులంతా కలిసి ఎంత రచ్చ చేశారో ఈ ఫోటో చక్కటి ఉదాహరణ.

రాశీ ఖన్నా క్యూట్ లుక్

రాశీ ఖన్నా క్యూట్ లుక్

పుట్టినరోజు వేడుకలో రాశీ ఖన్నా ఎంతో క్యూట్ గా కనిపించింది. అందగత్తె కావడం, మంచి టాలెంట్ కూడా ఉండటంతో రాశీ ఖన్నా వరుస అవకాశాలు దక్కించుకుంటోంది.

 అక్సిజన్ మూవీ

అక్సిజన్ మూవీ

రాశీ ఖన్నా నటించిన ఆక్సిజన్ మూవీ ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి టాక్ తో రన్ అవుతోంది. చిత్రంలో రాశీ ఖన్నా పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది.

ప్రస్తుతం చేస్తున్నవి

ప్రస్తుతం చేస్తున్నవి

ప్రస్తుతం రాశీ ఖన్నా తమిళంలో ‘సైతాన్ కా బచ్చా', ‘ఇమైక్కనోడిగల్' అనే చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో రవితేజతో ‘టచ్ చేసి చూడు', వరుణ్ తేజ్‌తో ‘తొలి ప్రేమ' చిత్రాల్లో రాశీ ఖన్నా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X