'రాశి' మరో ప్రయత్నం
రాశి, ఒకప్పుడు తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసిన నాయిక. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ తార తన భర్త నివాస్ ను దర్శకుడిగా నిలబెట్టేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఈ మధ్యనే నివాస్ దర్శకత్వంలో రిషి కథానాయకుడిగా 'మహా రాజశ్రీ' అనే సినిమాను నిర్మించి చేతులు కాల్చుకున్న రాశి, మరో సారి తన భర్త కోసం సినిమాను నిర్మించే పనిలో వున్నారట.
ఇందులో భాగంగా ఈ మధ్య పబ్లిక్ ఫంక్షన్లకు దూరంగా వుంటున్న రాశి, మొన్న జరిగిన సంతోషం ఫిలిం ఫేర్ అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యారు. మునుపటి లాగే భారీగా కనిపించినా, చూడటానికి చాలా బాగుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాస్త ఒళ్లు తగ్గించుకుంటే తిరిగి సినిమాల్లో రీ-ఎంట్రీ ఇచ్చే అవకాశం వున్నా రాశి ఇందుకు సుముఖంగా లేరని సమాచారం..
raasi nivaas rishi nikhita maharaja sri santosham awards రాశి నివాస్ రిషి నిఖిత మహా రాజశ్రీ సంతోషం అవార్డ్స్


Click it and Unblock the Notifications