»   » బాహుబలి విషయమై రాజమౌళికి హీరోయిన్ రాశి రిక్వెస్ట్

బాహుబలి విషయమై రాజమౌళికి హీరోయిన్ రాశి రిక్వెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పటి హీరోయిన్ రాశి... ప్రస్తుతం సినిమాల్లో నటించక పోయినా టీవీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడూ కనిపిస్తూనే ఉంది. అయితే ఆమె ఇటీవల దర్శకుడు రాజమౌళిని కలిసి బాహుబలి సినిమా గురించి రిక్వెస్ట్ చేయడం చర్చనీయాంశం అయింది. అనాధ బాలల కోసం బాహుబలి స్పెషల్ షో చూపించాలని రిక్వెస్ట్ చేయడానికి రాశి రాజమౌళిని కలిసింది.

ఇటీవల టీవీ ఇంటర్వ్యూలో రాశి ఈ విషయాన్ని వెల్లడిస్తూ...తన కూతురు మొదటి పుట్టినరోజు సందర్భంగా ఓ అనాధ శరణాలయానికి వెళ్లి వారికి అక్కడి పిల్లలకు గుడ్ క్వాలిటీ బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏర్పాటు చేసాను. ప్రతి సంవత్సరం ఇలానే చేయాలని నిర్ణయించుకున్నాను.


Raasi Requests Rajamouli for Baahubali

ఇటీవల ఓ సారి వెళ్లి వారితో గడిపినపుడు వారు ఇప్పటి వరకు థియేటర్లో ఒక్కసారి కూడా సినిమా చూడలేనది చెప్పారు. బాహుబలి సినిమాను థియేటర్లో చూడాలని ఆశ పడుతున్నారు. అయితే అప్పటికే బాహుబలి సినిమా థియేటర్ల నుండి తీసేసారు. అందుకే రాజమౌళిని కలిసి ప్రసాద్ ల్యాబ్స్ లో 100 మంది పిల్లల కోసం బాహుబలి స్పెషల్ షో వేయాలని రిక్వెస్ట్ చేసాను అని తెలిపారు.


రాశి రిక్వెస్ట్ పట్ల రాజమౌళి పాజిటివ్ గా స్పందించినట్లు తెలుస్తోంది. బాహుబలి నిర్మాతలతో మాట్లాడి ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమాను వారి కోసం ప్రత్యేకంగా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
Yesteryear heroine Raasi has apparently requested director SS Rajamouli for Baahubali. And no, it's not for any role. Raasi has apparently approached Rajamouli for the show of his recent blockbuster Baahubali. Going into details, Raasi asked Rajamouli for a special show for few orphan kids with whom she attached to.
Please Wait while comments are loading...