»   » మాజీ హీరోయిన్ రాశి...కూతురుతో కలిసి (ఫొటోలు)

మాజీ హీరోయిన్ రాశి...కూతురుతో కలిసి (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గోకులంలో సీత, శుభాకాంక్షలు చిత్రాల ద్వారా హీరోయిన్ గా పాపులర్ అయిన తెలుగు హీరోయిన్ రాశి గుర్తుండే ఉండి ఉంటుంది. ఆమె ఆ మధ్యన వివాహం చేసుకుని సినిమాలు తగ్గించింది. అంతేకాదు ఓ పాపకు తల్లి అయ్యింది. ఇదిగో ఈ క్రింద మీరు రాశిని, ఆమె పాపను కలిసిన ఫొటోలు చూడవచ్చు.

కెరీర్ విషయానికి వస్తే....

ఆతర్వాత చిన్న చిన్న సినిమాలకు మాత్రమే పరిమితం అయింది. అవకాశాలు తగ్గడంతో వ్యాంపు క్యారెక్టర్లు కూడా చేసింది.చివరి సారిగా ఆమె మహేష్ బాబు హీరోగా వచ్చిన 'నిజం' చిత్రంలో విలన్ గా, అనంతరం రవితేజ వెంకీ చిత్రంలో ప్రాధాన్యం లేని పాత్రలో కనిపించి తెరమరుగైంది. తర్వాత రాజేంద్రప్రసాద్ సరసం ఓ కామెడీ చిత్రం చేస్తూ రీఎంట్రీ ఇచ్చినా పెద్దగా వర్కవుట్ కాలేదు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

లావైపోయి, వేషాలు తగ్గిపోయిన హీరోయిన్ ఎవరూ అంటే రాశి అని టక్కున గుర్తుకు వస్తుంది. ఆమె సన్నబడి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ చిత్రంలో ఆమె కేవలం డబ్బింగ్ మాత్రమే చెప్తోంది. తేజ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మీకళ్యాణం' చిత్రంలో కాజల్ అగర్వాల్‌కి రాశి గాత్రదానం చేశారు. ఆ ప్రయత్నం ఆమెకు మంచి పేరే తెచ్చిపెట్టింది. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ రాశి 'మిర్చి' సినిమా కోసం డబ్బింగ్ చెప్పి వార్తల్లో నిలిచింది.

రాశి మీడియాతో మాట్లాడుతూ..... బాగా లావెక్కడం మూలంగానే ఈ ఏడేళ్లు సినిమాలకు దూరం అయ్యానని, ఇప్పుడు సన్న బడ్డానని చెప్పుకొచ్చింది. ఇంత కాలం చాలా అవకాశాల వచ్చినా కావాలనే పక్కన పెట్టానని, త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నానని, హీరోయిన్ లేదా, బాగా ప్రాధాన్యం ఉన్న పాత్రల కోసం ఎదురు చూస్తున్నానని, త్వరలోనే తన రీ ఎంట్రీకి సంబంధించిన వివరాలను అఫీషియల్ గా ప్రకటిస్తానని చెప్పుకొచ్చింది.

స్లైడ్ షోలో ..పాపతో కలిసిన ఫొటోలు

ఆ మధ్య స్లిమ్ అయ్యింది
  

ఆ మధ్య స్లిమ్ అయ్యింది

పెళ్లి తర్వాత నటనకు దూరమైన ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్‌కి సిద్ధమై బాగా స్లిమ్ అయ్యారు కూడా.

అంటోంది కానీ..
  

అంటోంది కానీ..

తమిళంలో శింబు, వినయ్ చిత్రాల్లో నటించిన రాశి ఇప్పుడు తమిళంలో ఓ హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంలో నటిస్తున్నా అన్నారు.

ఫైనలైజ్ చెయ్యాలంటోంది
  

ఫైనలైజ్ చెయ్యాలంటోంది

తెలుగులో మూడు, నాలుగు చిత్రాల్లో ఆఫర్లు ఉన్నాయనీ, వాటిని ఫైనలైజ్ చెయ్యాల్సి ఉందని రాశి చెప్పారు.

పెళ్లి చేసుకునే...
  

పెళ్లి చేసుకునే...

బాలనటిగా, హీరోయిన్‌గా ఎన్నో చిత్రాల్లో నటించిన రాశి పెళ్లి చేసుకుని చిత్రరంగానికి దూరమయ్యారు.

 

గ్యాప్ తర్వాత
  

గ్యాప్ తర్వాత

కొంతకాలం గ్యాప్ తరువాత ఆమె మళ్లీ చిత్రరంగ ప్రవేశం చేస్తున్నారు. నటనతో పాటు ఆమె డబ్బింగ్ మీద కూడా దృష్టి కేంద్రీకరించారు.

Please Wait while comments are loading...