twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గుండెపోటుతో నటుడు, రచయిత రావికొండలరావు మృతి.. శోకసంద్రంలో టాలీవుడ్

    |

    ప్రముఖ , సినీ జర్నలిస్టు, నటుడు, రచయిత రావి కొండలరావు ఇకలేరు. కొద్దికాలంగా వృద్దాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన మంగళవారం గుండెపోటుతో మరణించారు. ఆయన మృతితో తెలుగు, తమిళ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ఆయన మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రావి కొండలరావు మరణంతో సినీ పరిశ్రమ గొప్ప నటుడిని, రచయితను కోల్పోయింది అంటూ తమ సంతాప ప్రకటనలో పేర్కొంటున్నారు. రావి కొండలరావు సీనీ, వ్యక్తిగత జీవితం గురించి వివరాల్లోకి వెళితే..

    Recommended Video

    #RaaviKondalaRao : సీనియ‌ర్ న‌టుడు రావి కొండ‌ల‌రావు క‌న్నుమూత‌ ! || Oneindia Telugu
    రావి కొండలరావు వ్యక్తిగత జీవితం

    రావి కొండలరావు వ్యక్తిగత జీవితం

    రావి కొండల రావు 1932 ఫిబ్రవరి 11వ తేదీన శ్రీకాకుళంలో జన్మించారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. ఆయన భార్య, ప్రముఖ నటి రాధాకుమారి 2012లో మరణించారు. ఆయనకు శశి కుమార్ అనే కుమారుడు ఉన్నారు. ఆయన మంగళవారం గుండెపోటుతో హైదరాబాద్‌లో మరణించారు.

    గుండెపోటు రావడంతో

    గుండెపోటు రావడంతో

    మంగళవారం మధ్యాహ్నం రావి కొండలరావుకు గుండెపోటు రావడంతో సోమాజిగూడలోని వివేకానంద హాస్పిటల్‌కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన పార్దీవదేహాన్ని మోతీనగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం అక్కడే ఉంచుతారు. అనంతరం ఫిలిం చాంబర్‌కు తరలించే అవకాశం ఉంది.

     600 చిత్రాల్లో నటించి..

    600 చిత్రాల్లో నటించి..

    నటుడిగా రావి కొండలరావు 600 చిత్రాల్లో నటించారు. 1958లో శోభ చిత్రంతో కొండలరావు సినీ ప్రస్థానం మొదలైంది. 1965లో తేనే మనసులు చిత్రంతో నటుడిగా గుర్తింపు పొందారు. ప్రేమించి చూడు, రాముడు భీముడు, అలీ బాబా 40 దొంగలు, అందాల రాముడు, దసరా బుల్లోడు, జీవిత చక్రం, రంగూన్ రౌడీ, చంటబ్బాయ్, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, పెళ్లి పుస్తకం, బృందావనం, మేడమ్, భైరవద్వీపం, రాధా గోపాళం, మీ శ్రేయోభిలాషి, కింగ్, ఓయ్, వరుడు, 365 డేస్ లాంటి చిత్రాలతో ఆయన తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా స్థానం దక్కించుకొన్నారు.

    సినీ జర్నలిస్టుగా సేవలు

    సినీ జర్నలిస్టుగా సేవలు

    తెలుగు సినిమా పరిశ్రమలో సినీ జర్నలిస్టుగా ప్రవేశించారు. ఆ తర్వాత నటుడిగా మారారు విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొన్నారు. ఆ తర్వాత దర్శకుడిగా మారారు. దాదాపు ఏడు దశాబ్దాలపాటు సినీ పరిశ్రమతో అనుబంధం ఉంది.

    నటి రాధాకుమారితో వివాహం

    నటి రాధాకుమారితో వివాహం

    నటి రాధా కుమారిని రావి కొండలరావు వివాహం చేసుకొన్నారు. ఆమె 1962లో వచ్చిన తేనే మనసులు చిత్రంతో నట జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆమె దాదాపు 600 చిత్రాల్లో తల్లిగా, బామ్మగా నటించి మెప్పించారు. ఆమె 2012 మే 9న మరణించారు. ఆమె మరణం సమయంలో రావి కొండలరావు అమెరికా పర్యటనలో ఉన్నారు.

    English summary
    Raavi Kondala Rao died due to cardiac arrest. Many film personalities are expressed condolences due his death
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X