twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రావి కొండలరావు ఇకలేరు: బాల్యంలోనే జైలుశిక్ష.. జైలులోనే పుస్తక పఠనం.. జీవితానికి అదే మలుపు!

    |

    నటుడు, దర్శకుడు, రచయిత, సినీ జర్నలిస్టు రావి కొండలరావు ఇక లేరు. మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో హైదరాబాద్‌లో మరణించారు. నటుడిగా ఆయన 600 చిత్రాల్లో నటించారు. దీంతో దక్షిణాది సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని కీలకమైన సంఘటనలు మీ కోసం..

    14 ఏళ్ల వయసులో అరెస్ట్

    14 ఏళ్ల వయసులో అరెస్ట్

    గతంలో రావి కొండల రావు ఓ ఇంటర్వ్యూలో తన జీవితం గురించి వెల్లడిస్తూ.. నా చిన్నప్పటి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్‌ (ఆరెస్సెస్‌)తో అనుబంధం ఉండేది. నాకు అప్పుడు 14 ఏళ్లు. బెజవాడలో ఆరెస్సెస్‌కు సంబంధించిన సభను ఏర్పాటు చేశారు. గురు గోల్వార్కర్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారనడంతో మేము బెజవాడకు బయలుదేరాం. అయితే రైలు ప్రయాణంలో ఉండగానే జనవరి 30, 1948 రోజున గాంధీజీ హత్యకు గురయ్యారు. బెజవాడలో దిగిన తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గాంధీజీ మరణానికి మా సంస్థే కారణమని కొందరు మాపై దాడి చేశారు అని చెప్పారు.

    ఆరెస్సెస్ నిషేధాన్ని ఎదిరిస్తూ ర్యాలీ

    ఆరెస్సెస్ నిషేధాన్ని ఎదిరిస్తూ ర్యాలీ

    గాంధీజీ మరణం తర్వాత ఆరెస్సెస్‌‌పై నిషేధం విధించారు. మా సంస్థపై నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ రాజమండ్రి వీధుల్లో ర్యాలీ చేపట్టాం. మా ర్యాలీని భగ్నం చేయడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారు. అయినా పారిపోకపోవడంతో మమల్ని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెడితే న్యాయమూర్తి మూడు నెలల శిక్ష విధించారు. ఆ రాత్రే మమల్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు అని రావి కొండలరావు తెలిపారు.

    రాజమండ్రి జైలుకు వెళ్లిన తర్వాత

    రాజమండ్రి జైలుకు వెళ్లిన తర్వాత

    రాజమండ్రి జైలులోకి తీసుకెళ్లిన తర్వాత మమల్ని బట్టలు మార్చుకోమని కొన్ని బట్టలు ఇచ్చారు. అవి పాతవి, ఉతకనివి కావడంతో కంపు కొడుతున్నాయి. దాంతో మేము వాటిని తొడుక్కోలేమని మొండికేశాం. ఆ తర్వాత జైలు అధికారులు కొత్త బట్టలు తెచ్చి ఇవ్వడంతో వాటిని ధరించాం అనే విషయాన్ని ఇంటర్వ్యూలో పంచుకొన్నారు.

    జైలులో పెద్ద లైబ్రరీ

    జైలులో పెద్ద లైబ్రరీ

    రాజమండ్రి జైలులో ఉన్న సమయంలో పెద్ద లైబ్రరీ ఉండేది. ప్రతీ రోజు లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు చదివే వాడిని. రెండు నెలల పదిహేను రోజుల్లో రోజుకో పుస్తకం చొప్పున చదివాను. అక్కడే కొడవటిగంటి పద్మరాజు, శరత్ లాంటి వాళ్లు నాతో ఉన్నారు. పుస్తకాలు, కథలపై అక్కడే నాకు ఆకర్షణ ఏర్పడంది. జైలుశిక్ష నా జీవితాన్ని మార్చేసింది.

    Recommended Video

    Amrutha Pranay కామెంట్స్ పై స్పందించిన Ram Gopal Varma
    హాస్య నాటికతో రచయితగా

    హాస్య నాటికతో రచయితగా

    దొంగ దొరికాడు అనే హాస్య నాటికతో రచయితగా నా జీవితం మొదలైంది. హాస్య రచనలు చేయడానికి గురజాడ అప్పారావు స్పూర్తి. ఆ తర్వాత జర్నలిజంతో ఆసక్తిపెరగడంతో ఆనందవాణి పత్రికలో చేరాను. అలా నా జర్నలిస్టు జీవితం చెన్నైలో ప్రారంభమైంది. ఆ తర్వాత నా జర్నలిస్టు కెరీర్ చాలా ఏళ్లు కొనసాగింది అంటూ రావి కొండలరావు తన జీవితాన్ని గుర్తు చేసుకొన్నారు.

    English summary
    Actor, Writer, Director, Journalist Raavi Kondala Rao died due to cardiac arrest. Raavi Kondala Rao is a film actor and writer who appeared in Telugu films and has acted in over 600 films. He is the husband of veteran actress Radha Kumari. Many film personalities are expressed condolences due his death. Apart from this Raavi Kondala Rao had association with RSS, Raavi Kondala Rao arrested while protesting against RSS Ban
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X