»   » ఎన్టీఆర్ ‘రభస’మ్యాటర్..అంతా సర్దుకుంది

ఎన్టీఆర్ ‘రభస’మ్యాటర్..అంతా సర్దుకుంది

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్ : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా... కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'రభస'. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ నవంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఓ వారం క్రితం రభస షూటింగ్ ఆపుతారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పడన్నీ సర్దుకుని కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. స్క్రిప్టు విషయంలోనే ఎన్టీఆర్ సందేహాలు వెళ్లబుచ్చి...మార్పులు కోరగా...దర్శకుడు,నిర్మాత కలిసి ఒప్పించారని చెప్తున్నారు. రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్ తో ఎన్టీఆర్ ప్రతీ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.

    అయితే ఈ టైటిల్ ని ఎన్టీఆర్ మార్చమన్నట్లు సమాచారం. ఈ మేరకు 'జోరు' అనే టైటిల్ ని పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈచిత్రాన్ని బెల్లంకొండ సురేష్ సమర్పణలో శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా బెల్లంకొండ గణేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్లేబోయ్ గా కనపడతాడు అని చెప్తున్నారు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.

    Jr NTr

    సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ... మాస్‌ సినిమాలు చూస్తూ పెరిగినవాణ్ని నేను. నాకు ఎలాంటి చిత్రాలు నచ్చుతాయో అలాంటివే తీస్తాను. ఎన్టీఆర్‌ అనగానే శక్తివంతమైన సంభాషణలే గుర్తుకొస్తాయి. అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఇందులో మాటలుంటాయి. ఎన్టీఆర్‌ కథ వినగానే నన్ను ప్రోత్సహించారు. నా తొలి చిత్రంలో కథానాయకుడు ఎలాంటి బాధ్యత లేకుండా కనిపిస్తారు. కానీ ఇందులో హీరో పాత్రకి ఓ పెద్ద బాధ్యత ఉంటుంది. అది ఏమిటన్నది మాత్రం ఆసక్తికరం. ఇందులో సమంత పాత్ర కూడా కీలకమే'' అని చెప్పుకొచ్చారు.

    ఇక... ఇంకో నాలుగైదు సినిమాల తర్వాత కానీ ఎన్టీఆర్‌తో పనిచేసే అవకాశం రాదేమో అనుకొన్నాను. కానీ రెండో ప్రయత్నంలోనే ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. అంతకంటే ఓ గొప్ప బాధ్యత నా భుజాన వేసుకొన్నానన్న ఆనందం కలుగుతోంది అన్నారు.ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా ఉంటుందీ చిత్రం. మాస్‌ ప్రేక్షకులకు నచ్చే అంశాలతో పాటు వినోదం, కుటుంబ అనుబంధాలకి ప్రాధాన్యమిస్తూ కథను రాశా. ఎన్టీఆర్‌ తెరపై మూడు కోణాల్లో సాగే పాత్రలో నటించబోతున్నారు. ఓ ప్లేబాయ్‌ తరహాలో ఆయన పండించే వినోదం యువతరాన్ని అలరిస్తుంది. ప్రతీ అభిమాని గర్వపడేలా ఉంటుందీ చిత్రం అన్నారు.

    ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

    English summary
    NTR's Rabhasa will start its next shoot schedule from the 19th of November. Everything looks to be going smooth with the film now. Director Santhosh Srinivas who shot to fame with Kandireega is directing Rabhasa. The film is produced by Bellamkonda Suresh's son Bellamkonda Ganesh Babu.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more