ఈ రోజే ఎన్టీఆర్ గుమ్మిడికాయ కొడుతున్నారు

By Srikanya

హైదరాబాద్ : గుమ్మిడికాయ కొట్టడం అంటే షూటింగ్ ఆఖరి రోజు జరిగే ఓ తంతు అది. యూనిట్ అంతా ఆ రోజు తో షూటింగ్ పూర్తి అయ్యిందని ఈ గుమ్మిడికాయ తంతుని జరుపుతారు. ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'రభస'. ఈ చిత్రం గుమ్మిడికాయ ఈ రోజే రామోజీ ఫిల్మ్ సిటీలో ఉదయం పది గంటలకు కొడుతున్నారు. ఈ రోజుతో షూటింగ్ పూర్తి అవుతోంది. అందరిపై శుభం షాట్ చిత్రీకరించి ముగింపు పలకనున్నారు. రేపటినుంచి ఫోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మునిగిపోనున్నారు.

చిత్ర సమర్పకుడు బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ ''స్విట్జర్లాండ్‌లో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నాం. బుధవారం హైదరాబాద్‌లో చిత్ర ప్రధాన తారాగణంపై శుభం షాట్‌ చిత్రీకరిస్తాం. దీంతో చిత్రీకరణ పూర్తవుతుంది. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి'' అన్నారు.

Rabhasa Gummadikaya Ceremony today in RFC

దర్శకుడు చెబుతూ '''వినోదాత్మక కుటుంబ కథా చిత్రమిది. ఎన్టీఆర్‌ నటన, అతను పాడిన పాట, సమకూర్చిన నృత్యరీతులు.. అన్నీ కొత్తగా ఉంటాయి. ఎన్టీఆర్‌ అభిమానులకు ఈ సినిమా పండగలా ఉంటుంది. ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది. తమన్‌ చక్కటి పాటలిచ్చారు''అన్నారు. వచ్చే నెల 1న చిత్ర పాటలను విడుదల చేయనున్నారు.

ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X