రభస: బ్రహ్మానందం కడుపుబ్బా నవ్విస్తాడు (వీడియో)
హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా 'కందిరీగ' ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో అగ్రనిర్మాత బెల్లంకొండ సురేష్ సమర్పణలో యువ నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం 'రభస'.
ఈ చిత్రం ఆగస్టు 29న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి టీజర్లు విడుదల చేసారు. రభసలో బ్రహ్మానందం కామెడీ అదిరిపోయే విధంగా ఉంటుందని ఈ ట్రైలర్లు చూస్తే స్పష్టమవుతోంది.

ఈ సందర్భంగా బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ...'ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాడిన 'రాకాసి రాకాసి' ఈ ఆడియోకి హైలెట్ సాంగ్ గా నిలిచిందని తెలిపారు. త్వరలోనే ఈ చిత్రం ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేయబోతున్నాం. ఆది లాంటి బ్లాక్ బస్టర్ తర్వత మా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బేనర్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేస్తున్న ఈ చిత్రం అభిమానుల్ని, ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆగస్టు 29న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఎన్టీఆర్ కెరీర్లో, మా బేనర్లో ఇది సెన్సేషనల్ హిట్ సినిమా అవుతుంది' బెల్లంకొండ సురేష్ అన్నారు.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/OIP7IubN5dQ?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>
డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ...'యూత్ ఫుల్, మాస్, ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా రూపొందిన 'రభస'ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. ఎన్టీఆర్ 'రభస'లో పక్కా మాస్ లుక్ తో ఉంటారు. యూత్ ఫుల్ స్టైల్ లో కనిపిస్తారు. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంటారు. ఎన్టీఆర్ ఈ మూడు జోన్స్ ని టార్గెట్ చేసి తీస్తున్న సినిమా 'రభస'. రెండున్నర గంటల సేపు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి ఎంజాయ్ చేసి అందరూ ఐదారుసార్లు చూసేంత ఎంటర్టెనింగుగా ఉంటుంది. బెల్లంకొండ సురేష్ మేకింగ్ రేంజ్ ఏమిటో ఈ సినిమాలో కనిపిస్తుంది' అన్నారు.
ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో ప్రణీత మరో హీరోయిన్. బ్రహ్మానందం, అలీ, బ్రహ్మాజీ, నాజర్ జయసుధ, సీత, జయప్రకాష్ రెడ్డి, షాయాజీ షిండే, అజయ్, నాగినీడు, శ్రావణ్, భరత్, రవి ప్రకాష్, ప్రభాకర్, సురేఖావాణి, ప్రగతి, సత్యకృష్ణ, మీనా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఫోటోగ్రఫీ: శ్యామ్ కెనాయుడు, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, డాన్స్: రాజుసుందరం, ప్రేమ్ రక్షిత్, శేఖర్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, విజయ్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం, సమర్పణ: బెల్లంకొండ సురేష్, నిర్మాత: బెల్లంకొండ గణేష్, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











