డౌట్స్ క్లియర్...‘రభస’పై నిర్మాత ప్రెస్ నోట్

By Bojja Kumar

హైదరాబాద్: జూ ఎన్టీఆర్ 'రభస' చిత్రంపై అభిమానుల్లో నెలకొన్న డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తూ....దర్శక నిర్మాతల నుండి అఫీషియల్ ప్రెస్ నోట్ విడుదలైంది. ఈ చిత్రాన్ని సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ సమర్పణలో బెల్లంకొండ గణేష్ బాబు శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దర్శక నిర్మాతలు విడుదల చేసిన ప్రెస్ నోట్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ...' మా 'రభస' చిత్రం ఆడియోను సినీ ప్రముఖులు, ఎన్టీఆర్ అభిమానుల సమక్షంలో ఆగస్ట్ 1న శిల్పకళావేదికలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నాం. థమన్ సారథ్యంలో ట్యూన్ చేసిన అన్ని పాటలు చాలా ఎక్సలెంటుగా వచ్చాయి. ఎన్టీఆర్, థమన్ కాంబినేషన్లో 'రభస' మరో మ్యూజికల్ హిట్ అవుతుంది. అలాగే ఈ చిత్రాన్ని ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాం. యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతున్న ఈచిత్రం మా బేనర్లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది' అన్నారు.

Rabhasa movie press note

దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ 'యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా రూపొందుతున్న మా 'రభస' చిత్రంలో ఎన్టీఆర్‌ను కొత్త డైమన్షన్‌లో ప్రజెంట్ చేయ్యబోతున్నాం. ఎన్టీఆర్ నుండి అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. థమన్ చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మ్యూజికల్‌గా ఈ చిత్రం చాలా హై లెవల్ లో ఉంటుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాట పాడటం ఓ హైలెట్ అని చెప్పొచ్చు. ఆగస్టు 15న విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని, అభిమానుల్ని విశేషంగా అలరిస్తుంది' అన్నారు.

ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్‍‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రణీత మరో హీరోయిన్. బ్రహ్మానందం, అలీ, బ్రహ్మాజీ, నాజర్, జయసుధ, సీత, జయప్రకాష్ రెడ్డి, షాయాజీ షిండే, అజయ్, నాగినీడు, శ్రావణ్, భరత్, రవి ప్రకాష్, ప్రభాకర్, సురేఖా వాణి, ప్రగతి, సత్ కృష్ణ, మీనా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఫోటోగ్రఫీ: శ్యాకె నాయుడు, పాటలు: రామ జోగయ్య శాస్త్రి, శ్రీమణి, డాన్స్: రాజుసుందరం, ప్రేమ్ రక్షిత్, శేఖర్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, విజయ్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం, సమర్పణ: బెల్లంకొండ సురేష్, నిర్మాత: బెల్లంకొండ సురేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్.స

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X