ఎన్టీఆర్ గట్టేక్కడా? ‘రభస’ మౌత్ టాక్ ఎలా ఉంది?
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన 'రభస' చిత్రం భారీ అంచనాల మధ్య ఈ రోజు విడుదలైంది. ఎన్టీఆర్ సినిమా అంటే డిమాండ్ భారీగా ఉంటుంది. అందుకు తగిన విధంగానే సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 1200 థియేటర్లలో విడుదల చేసారు. ఓవర్సీస్‌తో పలు తెలుగునాట పలు ప్రాంతాల్లో సినిమా ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు వేసారు.
ఈ రోజు ఉదయమే సినిమా టాక్ ఏమిటో బయటకు వచ్చింది. 'రభస' చిత్రం ఎన్టీఆర్ అభిమానులు సంతృప్తి పడేలా ఉందని అంటున్నారు. సినిమా మొత్తం ఎన్టీఆర్ ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని, కామెడీ, యాక్షన్, డాన్స్ ఇలా అన్ని అంశాల్లోనూ ఇరగ దీసాడని అంటున్నారు.
సినిమా ఫస్టాఫ్ విషయానికొస్తే....జస్ట్ ఓకే అనే విధంగా ఉందని టాక్. సెకండాఫ్ ఇంకాస్త మోరుగ్గా ఉందంటున్నారు. మొత్తం మీద 'రభస' చిత్రం సగటు సాధారణ ప్రేక్షకుల్లో కొందరికి యావరేజ్ అనుభూతిని కలిగిస్తే....మరికొందరికి ఎబో యావరేజ్ అనుభూతి కలిగిస్తోంది. అయితే ఎన్టీఆర్ వీరాభిమానులు మాత్రం సినిమా సూపర్ హిట్ అంటున్నారు. మొత్తం మీద మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది.
అయితే సినిమాలో కమర్షియల్ అంశాలు మెండుగా ఉండటంతో....రివ్యూలు అనుకూలిస్తే మంచి ఫలితాలు సాధిస్తుందని అంటున్నారు. అయితే ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలో చూసిన వారిలో ఎక్కువ శాతం ఎన్టీఆర్ అభిమానులే కాబట్టి వారు చెప్పిన వివరాలు బట్టి......వాస్తవంగా సినిమా పరిస్థితి ఏమిటేనేది అంచనా వేయడం కష్టంగా ఉంది. ఫస్ట్ డే గడిస్తే సినిమా ఫలితాలపై పూర్తి అవగాహనకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
స్లైడ్ షోలో సినిమా చూసిన వారి అభిప్రాయాలు

Naren Reddy @NarensTweetz
ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉంది. ఎన్టీఆర్ ఒక్కడే ఫస్టాఫ్‌కి ప్లస్. సెకండాఫ్‌లో బ్రహ్మీ పెర్ఫార్మెన్స్ పేకాడేసాడు.

Hari Krishna Raju @harikraju
రభస ఫస్టాఫ్ బిలో యావరేజ్. సీన్లలో, డైలాగుల్లో దమ్ము లేదు. సెకండాఫ్ లో మెరాకిల్ జరుగాలి.

ఎబో యావరేజ్
రభస ఫస్టాఫ్ బిలో యావరేజ్. సెకండాఫ్ రిపోర్ట్ బాగుంది. సినిమా ఓవరాల్ ఎబో యావరేజ్ అంటున్నారు.

Dathu@DathuRulz
ఫస్టాఫ్ బరింగ్. కొత్తగా ఏమీ లేదు. ఓల్డ్ నస పెట్టాడు. బాగా స్లోగా ఉంది. సెకండాఫే సినిమాను గట్టెక్కించాలి.

Sunil @sunil77132
తాడిపత్రిలో పూర్తి షో చూసాను. ఫస్టాఫ్ యావరేజ్. సెకండాఫ్ గుడ్. ఓవరాల్ సినిమా ఎబో యావరేజ్ వేసుకోవచ్చు.

yogesh vadde @yogesh_vadde
సంతోష్ శ్రీనివాస్ పేరులో సంతోషం ఉంది కానీ...సినిమాలో లేదు. యంగ్ టైగర్ ఫెస్టివల్ డిజాస్టర్ ఈ సినిమా. డిస్సప్పాయింట్ అయ్యాను.

Shooter @Direct_Shooter
ఓవరాల్ కామెడీ బాగా వర్కౌట్ అయినా...ఇదొక రొటీన్ సినిమా. ఎన్టీఆర్‌కి మరొక హిట్. అంతకంటే ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేయలేము.

chand @chandpa1
రభస ఎన్టీఆర్ నుండి మరో యావరేజ్ మూవీ. తన స్టోరీ సెలక్షన్‌తో బుడ్డోడు మళ్లీ డిస్సప్పాయింట్ చేసాడు.

genuine_true @genuinestart
రభస ఒకసారికంటే ఎక్కువ చూడలేము. అదీ కూడా మీ ఓన్ రిస్క్. అభిమానులకు పండగేమో కానీ...ఆడియన్స్ కు మాత్రం కాదు.

Ary Vj @AryaVj_
ఫస్టాప్ గుడ్. పూర్తిగా సంతృప్తిగా ఉంది. సినిమా సూపర్. యాంటీ ఫ్యాన్స్‌కి ఏడవటమే పని. వాళ్లని లైట్ తీస్కోండి.

Baba @babanaidu1
ఫస్టాఫ్ డల్ గా ఉంది. సెకండాఫ్‌లో బ్రహ్మానందం కామెడీ బాగుంది.

Chowdary A Thamminee @simhadri86
రభస చిత్రానకి 3.5/5 రేటింగ్ ఇవ్వొచ్చు.

Rajesh @Rajesh_venky
బృందావనం తర్వాత నాకు బాగా నచ్చిన సినిమా ‘రభస'. ఈవినింగ్ షోకి మళ్లీ వెలుతున్నాను.

Bharat @Bharatbabu
ఫస్టాఫ్‌లో ఒకటి అరా సీన్లు తప్ప ఏమీ లేదు.

Raviprakash @RaaviNtr
ఎన్టీఆర్ ఎంట్రన్స్ బాగుంది. కాలేజీలో సీన్స్ సూపర్. ఇంటర్వెల్‌కి 20 నిమిషాల ముందు అల్లాడించాడు.


Click it and Unblock the Notifications











