15 మినట్స్ ట్రిమ్...‘రభస’లో ఆ సీన్లు తీసేసారు

By Bojja Kumar

హైదరాబాద్: ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'రభస' చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల హీరో ఎన్టీఆర్, నిర్మాత బెల్లంకొండ సురేష్ మరికొందరితో కలిసి స్పెషల్ షో వీక్షించారు. సినిమా చూసిన వారి నుండి ఫీడ్ బ్యాక్ అందుకున్న దర్శక నిర్మాతలు.....సినిమాలోని కొన్ని సీన్లు తీసేసి 15 నిమిషాల పాటు నిడివి తగ్గించినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఇలాంటి ఏమైనా ఉంటే సెన్సార్ పూర్తి కాకముందే చేస్తారు. అయితే సెన్సార్ పూర్తయిన తర్వాత కొంత మందికి సినిమా చూపించి....వారి నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ బట్టి ట్రిమ్ చేయడం చర్చనీయాంశం అయింది. ఇటీవల చాలా సందర్భాల్లో సినిమా విడుదలైన తర్వాత ఆడియన్స్ నుండి వచ్చే ఫీడ్ బ్యాక్ బట్టి ట్రిమ్ చేయడం చూసాం. అయితే 'రభస' నిర్మాతలు ముందు జాగ్రత్తలో భాగంగా విడుదలకు ముందే ఈ పని చేసినట్లు తెలుస్తోంది.

Rabhasa movie trimmed by 15 minutes

సినిమాలోని ఓ ఫైట్ సీన్‌తో పాటు, కొన్ని అనవసర సీన్లు తీసేసినట్లు సమాచారం. ఇలా చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని 'రభస' నిర్మాతలు ఆశిస్తున్నారు. దీంతో 2.30 గంటలు ఉన్న 'రసభ' రన్ టైం కాస్త....సీన్ల తొలగింపు తర్వాత 2.15 గంటలు అయినట్లు తెలుస్తోంది.

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, సమంత, ప్రణీత హీరో హీరోయిన్లుగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రభస' చిత్రం ఈ నెల 29న వినాయక చవితిని పురస్కరించుకుని గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 1200 స్క్రీన్లలో విడుదలవుతోంది. ఇప్పటికే చాలా చోట్ల 'రభస' చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ఈ రోజు నుండే మొదలైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X