ఇరగదీసిన ఎన్టీఆర్, సింహాద్రికి సీక్వెల్ అంటూ బ్రహ్మీ..
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన 'రభస' చిత్రం ఈనెల 15న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆడియో విడుదల సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఈ ట్రైలర్లో జూ ఎన్టీఆర్ యాక్షన్ సీన్లు ఇరగదీసాడు. అలా అని సినిమా మొత్తం యాక్షనే అని అనుకోవద్దు. ఫ్యామిలీ డ్రామా, లవ్, సెంటిమెంటు అంశాలు కూడా కలగలిపి ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ చివర్లో బ్రహ్మానందం...'ఒరేయ్ నేను సింహాద్రికి సీక్వెల్ రా' అంటూ చెప్పిన డైలాగ్ సినిమాలో కామెడీ ఏ రేంజిలో ఉంటుందో స్పష్టం చేస్తోంది.

దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ 'యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా రూపొందుతున్న మా 'రభస' చిత్రంలో ఎన్టీఆర్‌ను కొత్త డైమన్షన్‌లో ప్రజెంట్ చేయ్యబోతున్నాం. ఎన్టీఆర్ నుండి అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. థమన్ చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మ్యూజికల్‌గా ఈ చిత్రం చాలా హై లెవల్ లో ఉంటుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాట పాడటం ఓ హైలెట్ అని చెప్పొచ్చు. ఆగస్టు 15న విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని, అభిమానుల్ని విశేషంగా అలరిస్తుంది' అన్నారు.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/im1H_Y4SKSw?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>
ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్‍గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రణీత మరో హీరోయిన్. బ్రహ్మానందం, అలీ, బ్రహ్మాజీ, నాజర్, జయసుధ, సీత, జయప్రకాష్ రెడ్డి, షాయాజీ షిండే, అజయ్, నాగినీడు, శ్రావణ్, భరత్, రవి ప్రకాష్, ప్రభాకర్, సురేఖా వాణి, ప్రగతి, సత్ కృష్ణ, మీనా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఫోటోగ్రఫీ: శ్యాకె నాయుడు, పాటలు: రామ జోగయ్య శాస్త్రి, శ్రీమణి, డాన్స్: రాజుసుందరం, ప్రేమ్ రక్షిత్, శేఖర్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, విజయ్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం, సమర్పణ: బెల్లంకొండ సురేష్, నిర్మాత: బెల్లంకొండ సురేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











