ఈ హీరో అండతోనే...సూపర్, మెగా హీరోలతో దాసరి ఢీ!

By Bojja Kumar

హైదరాబాద్ : ఈ సంక్రాంతికి మూడే మూడు పెద్ద సినిమాల మధ్య పోటీ. అందులో వెంకీ-మహేష్ బాబు మల్టీ స్టారర్‌గా నటిస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న 'నాయక్' చిత్రంతో పాటు...కమల్ హాసన్ నటించిన తమిళ అనువాద చిత్రం 'విశ్వరూపం' ఉన్నాయి.

'విశ్వరూపం' చిత్రాన్ని ఏపీలో దాసరికి చెందిన సిరి మీడియా సంస్థ రిలీజ్ చేస్తోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నాయక్ చిత్రాలను నైజాం ప్రాంతంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ అండతో రంగంలోకి దిగిన దాసరి భారీగా లాభాలు వెనకేసుకుంటారా? లేక మహేష్, వెంకటేష్, రామ్ చరణ్ స్టార్ ఇమేజ్‌పై నమ్మకం పెట్టుకున్న దిల్ రాజు పై చేయి సాధిస్తాడా? అనేది చర్చనీయాంశం అయింది.

అయితే ఫిల్మ్ నగర్ వర్గాలు మాత్రం కమల్ హాసన్‌ను నమ్ముకున్న దాసరి కంటే..... మహేష్, వెంకీ, రామ్ చరణ్ సినిమాలపై ఆశలు పెట్టుకున్న దిల్ రాజు భారీ లాభాలతో గట్టెక్కడం ఖాయం అంటున్నారు. కమల్ హాసన్ సినిమాలకు ఇక్కడ మంచి గిరాకీ ఉన్నప్పటికీ.....లోకల్ స్టార్లను బీట్ చేసే సత్తా మాత్రం ఇప్పుడు ఆయనకు లేదని అంటున్నారు.

'విశ్వరూపం' సినిమా ఈ నెల 11న విడుదలవుతుండగా....రామ్ చరణ్ హీరోగా రూపొందిన 'నాయక్' చిత్రం జనవరి 9న థియేటర్లలో విడుదలవుతోంది. అదే విధంగా మల్టీస్టారర్ మూవీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం కూడా జనవరి 11నే థియేటర్లలో వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X