twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డ్రగ్స్ రాకెట్‌ నుంచి బెదిరింపులు.. నటుడు, ఎంపీ రవికిషన్‌కు Y+ భద్రత

    |

    డ్రగ్స్ రాకెట్ ‌నుంచి బెదిరింపులు ఎక్కువ కావడంతో సినీ నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్‌కు యూపీ ప్రభుత్వం భారీ భద్రతను కల్పించింది. ఇటీవల కాలంలో సుశాంత్ మరణం కేసులోను. అలాగే బాలీవుడ్‌తో డ్రగ్స్ సంబంధాలపై నటుడు రవికిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ క్రమంలో రవికిషన్‌కు Y+ క్యాటగిరి భద్రతను కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్ రాకెట్‌ సంబంధాలపై ఆరోపణలు చేసిన రవికిషన్‌‌కు ఎలాంటి బెదిరింపులు వచ్చాయింటే..

    దేశంలో తీవ్రమైన డ్రగ్స్ కల్చర్‌

    దేశంలో తీవ్రమైన డ్రగ్స్ కల్చర్‌

    పార్లమెంట్ సమావేశాల్లో రవి కిషన్ మాట్లాడుతూ.. దేశంలో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతున్నది. యువతను పెడదారిన పట్టించేందుకు కుట్ర జరుగుతున్నది. పాకిస్థాన్, చైనా నుంచి పంజాబ్, నేపాల్ ద్వారా దేశంలోకి డ్రగ్స్ సప్లై అవుతున్నది. ఫిలిం ఇండస్ట్రీలో డ్రగ్స్ కల్చర్ బాగా పెరిగిపోతున్నది అని రవి కిషన్ తన గళాన్ని వినిపించారు.

    సుశాంత్ మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు

    సుశాంత్ మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు

    గత కొద్ది నెలలుగా నటుడు, ఎంపీ రవికిషన్‌ సుశాంత్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే డ్రగ్స్ కేసులో సినీ నటుల లింకులను బయటపెట్టేలా ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని తన గళం వినిపించారు. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖుల నుంచి ఆయన తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

    జయబచ్చన్ వ్యాఖ్యలపై ఘాటుగా

    జయబచ్చన్ వ్యాఖ్యలపై ఘాటుగా

    ఇక పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా సినీ నటి, ఎంపీ జయబచ్చన్ చేసిన వ్యాఖ్యలపై రవికిషన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ ప్రతిష్ఠను దెబ్బ తీసే విధంగా కొందరు కుట్ర పన్నుతున్నారని జయబచ్చన్ చేసిన వాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఇలాంటి వివాదాల నేపథ్యంలో రవికిషన్‌కు, ఆయన కుటుంబానికి బెదిరింపులు రావడంతో భద్రత గురించి ప్రభుత్వాలకు విన్నవించుకొన్నారు.

    Recommended Video

    Ravana Lanka Movie Audio Launch
    యూపీ సీఎం యోగిత్యానాథ్‌కు థ్యాంక్స్

    యూపీ సీఎం యోగిత్యానాథ్‌కు థ్యాంక్స్

    తనకు Y+ భద్రతను కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసిన యూపీ ప్రభుత్వానికి, సీఎం యోగిత్యానాథ్‌కు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. నా కుటుంబానికి, నియోజకవర్గ ప్రజల కోసం తీసుకొన్న నిర్ణయం ఆనందం కలిగించింది. ప్రభుత్వ అండతో నా గళాన్ని ప్రజల కోసం వినిపించడంలో రాజీ పడబోను అని రవికిషన్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రవి కిషన్ గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

    English summary
    Race Gurram fame, Gorakhpur MP Ravi Kishan provided Y+ Security After Threats from Drug rocket. In this occassion, He thanks UP CM Yogithyanath and wrote in twitter that, Respected Maharaj ji, with my security in mind the Y+ category protection you have activated for me, my family and the people of my Lok Sabha constituency has made us indebted to you and we thank you for it. My voice will continue to resonate in the House.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X