అల్లు అర్జున్ ‘రేసు గుర్రం’ సెన్సార్ రిపోర్టు
హైదరాబాద్: అల్లు అర్జున్, శృతి హాసన్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'రేసు గుర్రం' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈచిత్రానికి సెన్సార్ బోర్డు నుండి U/A సర్టిఫికెట్ అందింది. ఈ చిత్రం నిడివి 2 గంటల 20 నిమిషాలు ఉన్నట్లు తెలుస్తోంది. నల్లమలుపు బుజ్జి, డాక్టర్ వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.
'రేసు గుర్రం' చిత్రం ఇద్దరు సోదరులకు మధ్య జరిగే కథాంశమని తెలుస్తోంది. చాలా కాలంగా సరైన సంబంధాలు లేని ఆ ఇద్దరు సోదరుల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే స్టోరీలైన్ ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంలో బోజ్‌పురి నటుడు రవికిషన్ మెయిన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు.

మరో హీరోయిన్ సలోని ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించనుంది. బ్రహ్మానందం కామెడీ ట్రాక్ సినిమాకు మరో హైలెట్. యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టెనర్‌గా దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని మలిచారు. ఈ నెల 11న సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.


Click it and Unblock the Notifications











