twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రేస్ గుర్రం లొకేషన్లో బన్నీ, శృతి(ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా సురేందర్ దర్శకత్వంలో 'రేస్ గుర్రం' చిత్రం షూటింగ్ ప్రస్తుతం యూరఫ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా షూటింగ్ లొకేషన్‌కు సంబంధించిన ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి.

    యూరఫ్‌లో జెనీవా, స్విట్జర్లాండ్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్నారు. నల్లమలుపు బుజ్జి, కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ మాయ చేసావెకు పని చేసిన సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస ఈచిత్రానికి పని చేస్తున్నారు

    ఈ చిత్రంలో అల్లు అర్జున్ బైక్ రేసర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. బన్నీ ఆ సీన్స్ కోసం బైక్ రేస్ ట్రైనింగ్ అయ్యినట్లు తెలుస్తోంది. ఒక్కసారి రేసు గుర్రం పరిగెట్టడం మొదలుపెట్టిందంటే విజయం సాధించేదాకా పరిగెడుతూనే ఉంటుంది. అటువంటి వేగంగా పరిగెత్తే గుర్రాన్ని చూస్తే ఎవరికైనా దాన్న ఎక్కి అందరికన్నా ముందు అనుకున్న చోటికి చేరాలని వుం టుంది. ఇదే అంశాన్ని దర్శకుడు సురేందర్‌రెడ్డి తన చిత్రంలో చూపబోతున్నారు అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

    నటీ నటుల వివరాలు

    అల్లు అర్జున్ సరసన శృతి హీసన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్యామ్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

    సాంకేతిక నిపుణుల వివరాలు...

    ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి.

    English summary
    Race Gurram shoot location pics out. Stylish Star Allu Arjun and Surender Reddy have teamed up for the film ‘Race Gurram’. The European schedule of this film already started.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X