అల్లు అర్జున్ ‘రేస్ గుర్రం’ మిలన్ (ఫోటోలు)
హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా సురేందర్ దర్శకత్వంలో 'రేస్ గుర్రం' చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆన్ లొకేషన్ స్టిల్స్ బయటకు వచ్చాయి. ప్రస్తుతం షూటింగ్ యూరఫ్ జరుగుతోంది. ప్రస్తుతం మిలన్లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ ఫోటోలను గమనిస్తుంటే ఇక్కడ పాటల చిత్రీకరణ జరుగుతున్నట్లు స్సష్టమవుతోంది.
రేస్ గుర్రం చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి, కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి.
స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోలు

ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో అల్లు అర్జున్ చేతిలో పూలు పట్టుకుని శృతి హాసన్‌కు లవ్ ప్రపోజ్ చేస్తున్నాడు. ఈచిత్రంలో వీరిద్దరి మధ్య జరిగే లవ్ ట్రాక్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఈ మధ్య ప్రతి సినిమాలోనూ గ్లామర్ తో రెచ్చిపోతున్న శృతి హాసన్ ఈచిత్రంలో తన గ్లామర్ విశ్వరూపాన్ని చూపించనుందని అంటున్నారు.

కిక్‌తో హిట్ కొట్టి స్టార్ దర్శకుడిగా మారిన సురేందర్ రెడ్డి, ఆ తర్వాత ఊసరవెల్లితో బోల్తా పడ్డాడు. అయితే ఈచిత్రంతో ఎలాగైనా హిట్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ బైక్ రేసర్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది. బన్నీ ఆ సీన్స్ కోసం బైక్ రేస్ ట్రైనింగ్ అయ్యినట్లు తెలుస్తోంది

ఒక్కసారి రేసు గుర్రం పరిగెట్టడం మొదలుపెట్టిందంటే విజయం సాధించేదాకా పరిగెడుతూనే ఉంటుంది. అటువంటి వేగంగా పరిగెత్తే గుర్రాన్ని చూస్తే ఎవరికైనా దాన్న ఎక్కి అందరికన్నా ముందు అనుకున్న చోటికి చేరాలని వుం టుంది. ఇదే అంశాన్ని దర్శకుడు సురేందర్‌రెడ్డి తన చిత్రంలో చూపబోతున్నారు అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

షూటింగ్ సందర్భంగా బైక్ సరదా తీర్చుకున్న శృతి హాసన్

అభిమానితో కలిసి శృతి హాసన్ ఇలా ఫోటోకు ఫోజులు ఇచ్చింది.


Click it and Unblock the Notifications











