‘రచ్చ’ మొదలయ్యేది సక్రాంతికే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తాజాగా సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ల లుక్ పోస్టర్లు, ట్రైలర్లు న్యూఇయర్ కానుకగా జనవరి 1న విడుదల చేయాలని తొలుత నిర్ణయించినప్పటికీ...తాజాగా అందిన సమాచారం ప్రకారం సంక్రాంతికి 'రచ్చ' మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలన్నీ విడుదలవుతున్న నేపథ్యంలో అదే సమయంలో థియేటర్లలోకి ట్రైలర్లు వదిలితే రెస్పాన్స్ భారీగా ఉంటుందనేది దర్శక నిర్మాతల ఆలోచనగా కనిపిస్తోంది.
రామ్ చరణ్, తమన్నా జంటగా నటిస్తున్న రచ్చ చిత్రం మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాల కోసమే ఏకంగా రూ. 2 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఎన్.వి. ప్రసాద్, పరాస్ జైన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











