twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ కోసం ‘రచ్చ రంబోలా’ సాంగ్ కేక!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'సార్ వచ్చారు'. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవితేజ ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. ఈచిత్రానికి సంగీతం సమకూర్చుతున్న దేవిశ్రీ ప్రసాద్ మాస్ మసాలా సాంగులు సిద్ధం చేస్తున్నారు.

    గతంలో రింగ రింగ, కెవ్వు కేక లాంటి హాట్ ఐటం నెంబర్లు కంపోజ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్...'సార్ వచ్చారు' చిత్రం కోసం 'రచ్చ రంబోలా' అనే మసాలా సాంగును కంపోజ్ చేస్తున్నారు. ఈచిత్రంలో రవితేజ సరసన కాజల్, రిచా గంగోపాధ్యయ్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు . గతంలో రవితేజ-పరశురామ్ కాంబినేషన్లో 'ఆంజనేయులు' అనే ప్లాపు మూవీ వచ్చినప్పటికీ ఈ సారి మాత్రం సినిమా హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారు అశ్వినీదత్.

    మరో వైపు రవితేజ 'బలుపు' అనే చిత్రానికి కూడా కమిట్ అయ్యారు. గోపీచంద్‌ మలినేని ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో డాన్‌ శ్రీను చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రసాద్‌ వి పొట్లూరి పివిపి సినిమా బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించన్నారు. ఈచిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌.

    మినిమమ్ హిట్ గ్యారంటీ హీరోగా ఉన్న రవితేజను ఈ మధ్య వరుసగా ప్లాపులు పలకరిస్తున్నాయి. రవితేజ నటించిన వీర, నిప్పు, దొంగల ముఠా, దరువు చిత్రాలు బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టాయి. తాజాగా రవితేజ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.

    English summary
    Well known producer Ashwini Dutt is making "Saar Vachhaaru" with Mass Maharaja Ravi Teja in the direction of Parasu Ram. Ravi Teja play Football Coach role. Richa Gangopadhyay, Kajal playing female leads and Devisri Prasad is the music director. Devi Sri Prasad has once again composed a foot tapping song named ‘Racha Rambola’ for Mass Maharaja Ravi Teja’s new movie ‘Sir Vacharu’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X