ఆ సినిమాలో 'పుట్టింటోళ్లు తరిమేశారు...' రీమిక్స్

By Srikanya

హైదరాబాద్ : జయమాలిని అప్పట్లో డాన్స్ చేసి మెప్పించిన 'పుట్టింటోళ్లు తరిమేశారు.. కట్టుకున్నాడు వదిలేశాడు..' పాట గుర్తుండే ఉంటుంది. ఇప్పుడా పాట రీమిక్స్ అవుతోంది. నారా రోహిత్‌, నిత్యమీనన్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'ఒక్కడినే' చిత్రం లో ఈ పాటను రీమిక్స్ చేసి చిత్రీకరించారు. శ్రీనివాస్‌ రాగ దర్శకత్వం వహిస్తున్నారు. సి.వి.రెడ్డి నిర్మాత.

ఇటీవల రామోజీ ఫిల్మ్‌సిటీలో రచనామౌర్యపై ఈ ఐటం సాంగ్ ని తెరకెక్కించారు. పుట్టింటోళ్లు తరిమేశారు... కట్టుకున్నోడు వదిలేశాడు... అని సాగే ఈ పాటని రీమిక్స్ వెర్షన్ ని సాహితి రచించారు. భాను నృత్యరీతులు సమకూర్చారు. దీన్ని రచనామౌర్యతోబాటు 12 మంది అబ్బాయిలు 70 మంది మోడల్స్‌పైన భాను మాస్టరు తీసారు. ఈ పాటతో ఒక డ్యూయెట్‌ సాంగ్‌ మినహా మొత్తం చిత్రం పూర్తయింది.

ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ''కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే కథాంశమిది. అప్పటిదాకా అయినవాళ్ల మధ్య ఆనందంగా గడిపిన ఓ కుర్రాడు ఒంటరి అవ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో తెరపైనే చూడాలి. వినోదం, యాక్షన్‌ అంశాలకు ప్రాధాన్యముంది. నారా రోహిత్‌ నటన ఆకట్టుకొంటుంద''అన్నారు.

నిర్మాత సివీరెడ్డి మాట్లాడుతూ...''ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ఇదే నెలలో గీతాల్ని విడుదల చేస్తాము''అన్నారు . నాగబాబు, సాయికుమార్‌, చంద్రమోహన్‌, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, జీవీ, బెనర్జీ, అలీ, శ్రీనివాసరెడ్డి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: చింతపల్లి రమణ, ఛాయాగ్రహణం: ఆండ్రు, సంగీతం: కార్తీక్‌.

ఈ చిత్రంలో నాగబాబు, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, సాయికుమార్, బ్రహ్మానందం, యం.యస్.నారాయణ, జీవీ, అలీ, శ్రీనివాసరెడ్డి, సత్యకృష్ణ, సుధ, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: చింతపల్లి రమణ, సంగీతం: కార్తీక్, కెమెరా: ఆండ్రూ బాబు, కళ: నాగేంద్ర, ఫైట్స్: గణేష్, కూర్పు: మార్తాండ్.కె.వెంకటేష్, నిర్మాత: సి.వి.రెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీనివాస రాగ

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X