సినీ రచయిత ఇంట్లోనే రచయిత ఆడియో రిలీజ్.. జగపతిబాబు
Recommended Video

విద్యా సాగర్ రాజు, సంచిత పదుకొనే, శ్రీధర్ వర్మ, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు నటిస్తున్న చిత్రం రచయిత. దర్శకుడు విద్యాసాగర్ రాజ్, కళ్యాణ్ ధూలిపాళ్ల నిర్మాత, షాన్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో సోమవారం సినీ రచయిత చంద్రబోస్ ఇంట్లో హీరో, విలన్, జగపతిబాబు పాటలను విడుదల చేశారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన జగపతిబాబు మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా పేరు రచయిత. ఈ సినిమా ఆడియోను ఓ పాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్న చంద్రబోస్ ఇంట్లో, ఆయన కూర్చొనిని పాటలు రాసే స్థలంలో వద్ద విడుదల చెయ్యడం చాలా సంతోషంగా వుంది అని అన్నారు.

సాధారణంగా సినిమాకు పనిచేసే అందరికి పేరు వస్తుంది కానీ రచయితకి మాత్రం రాదు. ఈ విషయం నాకు నచ్చదు. అందుకే ఈ రోజు ఇలా ఈ పాటలు విడుదల చెయ్యడం ద్వారా పాటకు, రచయితకు ఇచ్చిన గౌరవంలా భావిస్తున్నాను. ఒక చిన్న సినిమా బయటకు రాకుండా పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో చిన్న సినిమా సహకారం అందించాలని జగపతి బాబు అన్నారు.


Click it and Unblock the Notifications











