రామ్ చరణ్ ‘రచ్చ’ 100 డేస్ సెంటర్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన 'రచ్చ' చిత్రం జులై 13తో 100 రోజులు పూర్తి చేసుకోబోతోంది. 127 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 5 డైరెక్ట్ సెంటర్లలో 100 రోజుల పండుగ జరుపుకోబోతోంది. ఏయే ప్రాంతాల్లో ఈ చిత్రం 100 రోజుల వేడుక జరుపుకోబోతోందనే వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
1. విజయవాడ
2. కానినాడ
3. అనకాపల్లి
4. శ్రీకాకుళం
5. ఆధోని
రామ్ చరణ్, తమన్నా జంటగా నటించిన ఈచిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించారు. రామ్ చరణ్ కెరీర్లో 'మగధీర' చిత్రం తర్వాత పెద్ద హిట్‌గా నిలిచింది. అదే విధంగా 2012 సంవత్సరంలో టాలీవుడ్‌లో 100 సెంటర్లకు పైగా 50 రోజులు పూర్తి చేసుకున్న తొలి సినిమాగా నిలిచింది. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి ఆర్.బి.చౌదరి సమర్పకులు కాగా, ఎన్.వి.ప్రసాద్, పారస్ జైన్ నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి, రచన: పరుచూరి బ్రదర్స్, ఎడిటింగ్: గౌతంరాజు, కళ: ఆనంద్‌సాయి, కొరియోగ్రఫీ: రాజు సుందరం, శోబి.
ప్రస్తుతం రామ్ చరణ్ బాలీవుడ్ మూవీ 'జంజీర్' షూటింగులోపాల్గొంటున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చరణ్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ 'జంజీర్' చిత్రాన్ని అదే పేరుతో మళ్లీ రీమేక్ చేస్తున్నారు.
ఈచిత్రంతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంలో, వివి వినాయక్ దర్శకత్వంలో మరో చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ మూడు చిత్రాలకు డేట్స్ అడ్జెస్ట్ చేసుకుంటూ తీరిక లేకుండా కష్ట పడుతున్నాడు చరణ్. తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవాలనే కసి రామ్ చరణ్‌లో కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











