'రచ్చ' ఆడియో విడుదల తేదీ ఖరారు
రామ్ చరణ్ తాజా చిత్రం 'రచ్చ' ఆడియో పంక్షన్ కోసం మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆడియోని పిబ్రవరి 20న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం భారీగా ప్లాన్ చేస్తున్నట్లు,అభిమానులంతా ఆ రోజు హైదరాబాద్ చేరుకునేటట్లు సమాచారాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఒక పాటను నెట్ లో లీక్ చేసారు. ఆ పాట అందరి అభిమానాన్ని చూరగొంటోంది.మణిశర్మ స్వరపరిచన ఈ సాంగ్ సినిమా హైలెట్స్ లో ఒకటిగా చెప్తున్నారు. ఈ సాంగ్ ఇలా సాగుతుంది..."సైలెంట్ చూపులోడు...వైలెంట్ చేతలోడు ...కరెంట్ కండలోడు..హీ ఈజ్ ద మిస్టర్ తీస్ మార్ ఖాన్ ...రచ్చ...అడుగేస్తే సీడెడ్..ఆంధ్రా..నైజాం..రచ్చ...వీడు రెచ్చిపోతే ఖచ్చితంగా రచ్చ..హీఈజ్ గోయింగ్ టుబి ఎ మెగాస్టార్...హీఈజ్ గోయింగ్ టు బి ఎ గెగా స్టార్.. హీ ఈజ్ గోయింగ్ టు బి ఎ యుగా స్టార్..అంటూ మాస్ బీట్ తో ఈ సాంగ్" సాగుతుంది.
ఈ సాంగ్ లో... బాలీవుడ్ లో'రాస్కెల్స్' ,'ఆయేషా'చిత్రాలలో హీరోయిన్ గా చేసిన లీసా హైడెన్ రామ్ చరణ్ తో డాన్స్ చేస్తుంది. ఇటీవలే హైదరాబాద్‌లో ప్రేమ్ రక్షిత్ నృత్యరీతులు సమకూర్చగా ఆ గీతాన్ని తెరకెక్కించారు. ఇక రచ్చ చిత్రాన్ని మహా శివరాత్రి కానుకగా అందించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన తమన్నా నటిస్తోంది. మాస్ మసాలా, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పరాస్ జైన్, ఎన్.వి.ప్రసాద్ మెగా సూపర్ గుడ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఫిబ్రవరిలో ఆడియో, మార్చిలో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











