రామ్ చరణ్ రచ్చ 'గొడ్డలి' ఆక్షన్ కి...
రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చ లో వాడిన గొడ్డలిని ఆన్ లైన్లో ఆక్షన్ కి పెడుతున్నారు. రచ్చలో క్లైమాక్స్ సీన్ లో ఆ గొడ్డలి ని వాడారు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్ వారు ఆ గొడ్డలని ఆక్షన్ కి పెట్టి ఆ వచ్చే డబ్బుని పేద నటీనటులకు పంచనున్నారు. ఇక ఈ గొడ్డలని గెలుచుకున్న రామ్ చరణ్ అభిమాని..డైరక్ట్ గా రామ్ చరణ్ చేతులు మీదుగా ఆ గొడ్డలిని అందుకోవచ్చు.
ఇక గతంలోనూ రామ్ చరణ్...నాట్ నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో 'ఆరెంజ్' చిత్రంలో వాడిన రెండు వేల డాలర్లు విలవ గల ఎల్లో జాకెట్ ను ఆక్షన్ పెట్టి వచ్చిన వేల డాలర్స్ ను తన వంతు సాయింగా అర్చనకు అంద చేసారు. అర్చన అమెరికాలో యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. ఇక ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ ని అందరూ మెచ్చుకున్నారు. అక్కడే రామ్ చరణ్ నికి యూత్ ఐకాన్ అవార్డు ఇచ్చి సత్కరించారు.
అలాగే రామ్ చరణ్ నటించిన మగధీర చిత్రంలో రామ్ చరణ్ ఉపయోగించిన కత్తి, డాలు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆన్ లైన్ లో వేలానికి పెట్టిన సంగతి తెలిసిందే. అలాగే ఆక్షన్ ప్రైస్ ను ఒక లక్షగా నిర్ణయించారు. మగధీర హిట్టయిన రేంజిలోనే ఈ వేలంలో చాలా ఎక్కువ మొత్తానికి అభిమానులు ఈ వస్తువులను సొంతం చేసుకున్నారు. లక్షా అరవే వేలకే హైయిస్ట్ కోట్ అయినట్లు సమాచారం. ఆ రేటు కోట్ చేసిన మెగా ఫ్యాన్ రంజిత్ కోక దీనిని సొంతం చేసుకున్నారు.
ఇక ఇంతకు ముందు కూడా అదుర్స్' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ వాడిన జాకెట్ (కోటు), హ్యాట్ (టోపీ)లను కూడా వేలంలో పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ పేరిట ఓ పోర్టల్‌ను నడుపుతున్న అమెరికాలోని లాస్ ఏంజలెస్ కు చెందిన ఎన్నారై మురళీ రవి జాకెట్ దక్కించుకోగా, హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో క్వాలిటీ అనలిస్ట్‌గా పని చేస్తున్న ప్రవీణ్ కుమార్ హ్యాట్ ను పొందారు. మరి ఇక భవిష్యత్ లో మా అశోశియేషన్ ఇంకేమి వేలానికి పెట్టనున్నారో చూడాలి.


Click it and Unblock the Notifications











