రామ్ చరణ్ ‘రచ్చ’ కి పరుచూరి బ్రదర్శ్ పోటు గుచ్చుకుంటుందా?
''ఈ సంస్థలో మాకిది నాలుగవ చిత్రం. చరణ్‌తో మొదటి సినిమా. 'మగధీర"ను మించే స్థాయిలో హిట్ ఇవ్వాలని కృషి చేస్తున్నాం..ఇది మాకు పెద్ద ఛాలెంజ్ "" అన్నారు రైటర్ పరుచూరి వెంకటేశ్వరరావు. మొన్న ఆదివారం రామ్‌చరణ్, తమన్నా జంటగా మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ ప్రై. లిమిటెడ్‌పై సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న 'రచ్చ" షూటింగ్ మొదలైన సంగతితెలిసిందే.ఈ సందర్భంగా పరుచూరి వెంకటేశ్వరరావు అన్న మాటలివి. అవే ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారాయి.పరుచూరి బ్రదర్శ్ కి నిజానికి ఇప్పుడు అస్సలు డిమాండ్ లేదు.
వారు ఈ మధ్యరచన చేసిన చిత్రాలు అన్నీ భాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.రీసెంట్ గా వారు రచన చేసిన రవితేజ చిత్రం వీర అయితే భాక్సాఫీస్ వద్ద బాంబ్ లాగ పేలింది.దాంతో తాముఛాలెంజ్ గాతీసుకుని చేస్తున్నామని అనగానే మళ్ళీ ఏ ఎనభైలనాటి సీన్స్,డైలాగులతో వస్తారో అని డైరక్టుగానే కామెంట్స్ చేస్తున్నారు. అందులోనూ రామ్ చరణ్ ఆల్రెడీ ఆరెంజ్ ప్లాప్ లో ఉన్నారు.అలాగే రామ్ చరణ్ తో మొదలైన మెరపు చిత్రం స్క్రిప్టు వర్క్ కూడా పరుచూరి వారు చాలా కాలం చేసారు.దాంతో ఇలా డౌట్స్ వస్తున్నాయి.నిజానికి ఇది పరుచూరి వారికి టెస్ట్ లాంటిది అంటున్నారు. మళ్ళీ తాము ఈ తరానికి తగినట్లే రాయగలరో లేదో ననితేలిపోతుందంటున్నారు .అదీ సంగతి.


Click it and Unblock the Notifications











