'నా అబ్బను అంటే ఎవడి అబ్బనయినా...: 'రచ్చ'డైలాగు
నా అబ్బను అంటే ఎవడి అబ్బని అయినా నరుకుతా అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగు ధియోటర్స్ లో విజిల్ వేయిస్తుందని చెప్తున్నారు. రామ్ చరణ్ తాజా చిత్రం 'రచ్చ'ఈ రోజే విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అందులో తన తండ్రి పార్ధీపన్ ని కామెంట్ చేసిన వాళ్లపై రామ్ చరణ్ ఫైర్ అవుతూ చెప్పే డైలాగు ఇది అని తెలుస్తోంది. పరుచూరి మార్క్ తో కూడిన ఇలాంటి డైలాగులు అడుగడగుకీ టప్పట్లు కొట్టిస్తాయిని అంటున్నారు.
అలాగే...సినిమా ప్రారంభంలో వచ్చే కార్ రేస్ సీన్ లో ...మా వాడు వచ్చిందే రికార్డులు బ్రద్దలు కొట్టడానికిరా..అంటూ హీరో ప్రెండ్స్ డైలాగు చెప్తారు. ఆ డైలాగుకి ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చుతోంది. అతను అడుగేస్తే ఆడి, కనిపిస్తే త్రీడీ, షర్ట్ తీస్తే లోపల సూపర్ బాడీ అంటూ మరో డైలాగు కేకపెట్టిస్తోంది. ఇక తమన్నాతో ...ఒక్కసారి లెప్ట్ కి టర్న్ వేసుకో అంటూ చెప్పే డైలాగు, కండ తక్కువ...కటింగ్ ఎక్కువా అంటూ చెప్పే డైలాగు సూపర్ గా ఉంటుంది. అలాగే విలన్ తో ...నువ్వు అరిస్తే అరుపులే...నేను అరిస్తే మెరుపులే అనటం తెగ నచ్చుతోంది.
ఇక రామ్ చరణ్ తండ్రి చిరంజీవి కెరీర్ లోనే ఎన్నో బిగ్గెస్ట్ హిట్లు ఇచ్చిన ఈ జంట రచయితలు పరుచూరి బ్రదర్స్ తొలిసారిగా చరణ్ చిత్రానికి డైలాగులు రాస్తున్నారు. ఈ సందర్భంగా వారిని కలిసిన మీడియాతో మాట్లాడుతూ రచ్చలోని తమకు ఇష్టమైన డైలాగుని చెప్పారు. ఆ డైలాగు ఏమిటంటే... అతను అడుగేస్తే ఆడి, కనిపిస్తే త్రీడీ, షర్ట్ తీస్తే లోపల సూపర్ బాడీ. అలాగే రచ్చ చిత్రంలో విలన్, హీరో కలిసినప్పుడల్లా డైలాగులు అదిరిపోతాయి.. మా మార్కు డైలాగులు అందరికీ అలరిస్తాయి అంటున్నారు పరుచూరి బ్రదర్శ్.
ఇక చిత్రంలో రామ్ చరణ్ క్యారెక్టరేజన్ గురించి చెపుతూ... అతను యూత్ కాబట్టి దానికి తగ్గ లవ్ స్టోరీ, ఆయన ఫాదర్ కి తగ్గట్లు మాస్ స్టోరీ ఉంటుంది. అది కొత్త ప్రయోగమేమీ కాదు కానీ బాగా వర్కవుట్ అయ్యింది. సినిమా చూస్తే అర్దమవుతుంది అని చెప్పారు. ఇక బయిట నిజ జీవితంలో రామ్ చరణ్ గురించి చెపుతూ.. సినిమాలో కొదమసింహంలా ఉన్నాడతను. బయిట చాలా వినయవంతుడు. చాలా గొప్ప క్యారెక్టర్ అతనికి. గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అతను అంటూ మెచ్చుకున్నారు. అలాగే తాము రచ్చ రష్ చూసి రామ్ చరణ్, తమన్నా జంటను చూసి చాలా ముచ్చటపడ్డామని అన్నారు.


Click it and Unblock the Notifications











