రేపటి నుంచే హైదరాబాద్ లో ‘రచ్చ’
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తాజాగా నటిస్తున్న 'రచ్చ' సినిమా న్యూ షెడ్యూల్ రేపటి(జనవరి 5) నుండి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రామ్ చరణ్, తమన్నాలపై పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
ఇప్పటికే దాదాపు 50శాతం షూటింగ్ పూర్తి అయింది. సక్రాంతికి రచ్చ ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం ప్రకారం చరణ్, తమన్నా ఇందులో మెడికల్ స్టూడెంట్ పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. రంగం ఫేమ్ అజ్మల్ ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్నాడు.
పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రం చిరంజీవి ఎనభైల నాటి మాస్ సినిమాలా అలరిస్తుందంటున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న రచ్చ చిత్రాన్ని పరాస్ జైన్, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. తమన్నా ఈ చిత్రం ద్వారా రామ్ చరణ్ తో తొలిసారి రొమాన్స్ చేస్తోంది. మార్చికల్లా ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సమర్పణ: ఆర్.బి.చౌదరి, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి.


Click it and Unblock the Notifications