రామ్ చరణ్ ‘రచ్చ’కు సాలిడ్‌గా హిందీ రైట్స్
రామ్ చరణ్ తేజ్ నటించిన రచ్చ సినిమా హిందీ రైట్స్ సాలిడ్ రేటుకు అమ్ముడు పోయాయి. ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం బాలీవుడ్ నిర్మాతలు రచ్చ హిందీ రైట్స్ ను రూ. 1.5 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈచిత్రంలో రామ్ చరణ్ తేజ్్ సరసన తమన్నా హీరోయిన్‌గా నటించింది. మణి శర్మసంగీతం అందించారు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్ బ్యానర్ పై ఎన్.వి. ప్రసాద్, పరాస్ జైన్ ఈచిత్రాన్ని నిర్మించారు.
త్వరలో జంజీర్ రీమేక్ ద్వారా బాలీవుడ్ లో తెరంగ్రేటం చేయబోతున్న రామ్ చరణ్‌కు 'రచ్చ' సినిమా హిందీ రైట్స్ ఇంత పెద్ద మొత్తంలో అమ్ముడు పోవడం ప్లస్సవుతుందని, హిందీలో కూడా రచ్చ సక్సెస్ అయితే రామ్ చరణ్ సినిమాలకు బాలీవుడ్ లోనూ క్రేజ్ పెరుగుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ తేజ్్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో చెర్రీ సరసన సమంత, అమీ జాక్సన్ రొమాన్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: అబ్బూరి రవి, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.
ఎవడు చిత్రం తర్వాత చరణ్ వివి వినాయక్ దర్శకత్వంలో ఓ చిత్రానికి కమిట్ అయ్యారు. ఇందులో ఈ యువ హీరో డబల్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివి వినాకయ్ స్క్రిప్టు వర్కు కూడా ప్రారంభించించారు.


Click it and Unblock the Notifications











