రామ్ చరణ్ ఫుల్ మీల్స్ పెట్టనున్నాడా

By Srikanya

రామ్ చరణ్ తన తాజా చిత్రం రచ్చతో తన అబిమానులుకు ఫుల్ మీల్స్ పెట్టనున్నాడని చెప్పుకుంటున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం శ్రీలంక షెడ్యూలుని కంప్లీట్ చేసుకుని బ్యాంకాక్ కి ప్రయాణమైంది. అక్కడ రెండు పాటలు, ఓ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ లోని టైటిల్ సాంగ్ రీమిక్స్ హైలెట్ గా ఉంటుందని చెప్తున్నారు. దసరాకి ఈ చిత్రం విడుదల చేయాలనే పట్టుదలతో ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు. అలాగే రచ్చ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా చెప్తున్నారు.

కామిడీ, రొమాన్స్, సెంటిమెంట్, పైట్స్, పాటలు అన్నీ ఉంటాయంటున్నారు. హిట్ ఫార్ములాతో రూపొందిన కథతో ఈ చిత్రం రూపొందిస్తున్నారని చెప్తున్నారు. ఇక మెగా సూపర్‌గుడ్‌ పతాకంపై ఎన్వీ ప్రసాద్‌, పారస్‌ జైన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏమైంది ఈ వేళ చిత్రంతో దర్శకుడుగా మారిన సంపత్‌ నంది ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. అలాగే ఈ సినిమా కోసం కళా దర్శకుడు ఆనంద్ ‌సాయి ప్రత్యేకంగా ఓ సెట్‌ని తీర్చిదిద్దారు. కమర్షియల్ అంశాలతో కూడిన చరణ్‌ పాత్ర తప్పకుండా అన్ని వయసులవారికీ నచ్చుతుందని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ఈ చిత్రానికి సమర్పణ: ఆర్‌.బి.చౌదరి, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X