'రచ్చ' రిలీజ్ ఆ రోజు ఎందుకు పెట్టారంటే

By Srikanya

రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చ ఏప్రియల్ 5న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ రోజు విడుదల తేదీ పెట్టడానికి కారణం వరసగా హాలిడేస్ రావటమే అంటున్నారు. జాగ్రత్తగా చూసి ప్లాన్ చేసి,వీకెండ్, వరస హాలీడేస్ కలిసి వచ్చేలా ప్లాన్ చేసారని చెప్తున్నారు. వరస హ్యాలీడేస్ ఖచ్చితంగా పిల్మ్ రన్ కి గ్యారెంటీగ ఉపయోగపడతాయంటున్నారు. గురువారం నుంచి ఆదివారం వరకూ జనం రిలాక్స్ గా ఈ సినిమా చూసేలాగేనే ఈ ప్లాన్ చేసారంటున్నారు. ఇక ఈ హ్యాలీడేస్ వరసగా ఇలా ఉన్నాయి...

ఏప్రియల్ 5 బాబు జగజ్జీవన్ రామ్ జయింతి...స్టేట్ గవర్నమెంట్ హ్యాలిడే
ఏప్రియల్ 6 గుడ్ ప్రైడే ..సెంట్రల్ గవర్నమెంట్ హ్యాలిడే
ఏప్రియల్ 7 శనివారం వీకెండ్- ఏప్రియల్ 8 ఆదివారం వీకెండ్
ఇలా ఈ రిలీజ్ డేట్ ని ఓ స్టాటజీగా భాక్సాఫీస్ కలెక్షన్స్ కుమ్మటానికి ప్రయోగిస్తున్నారు. అందులోనూ ఈ చిత్రంపై ఇప్పటికే విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యి ఉంది.

ఇక రీసెంట్ గా రిలీజైన రచ్చ' చిత్రం పాటలకి ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ బాగా నచ్చుతోంది. సూపర్‌గుడ్‌ మూవీ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్‌. వి. ప్రసాద్‌, పరాస్‌ జైన్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్‌ సరసన హీరోయిన్‌గా తమన్నా నటిస్తోంది.

ఈ సినిమాలో రామ్ చరమ్ మెడికోగా కనిపించనున్నారు. కారు రేసుల బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుంది. అందులో రామ్ చరణ్ పేరు విశ్వం. ఇక టైటిల్ సాంగ్ లో...బాలీవుడ్ లో 'రాస్కెల్స్‌', 'ఆయేషా'చిత్రాలలో హీరోయిన్ గా చేసిన లీసా హైడెన్‌ రామ్ చరణ్ తో డాన్స్ చేస్తుంది. హైదరాబాద్‌లో ప్రేమ్‌ రక్షిత్‌ నృత్యరీతులు సమకూర్చగా ఆ గీతాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్‌, ఛాయాగ్రహణం:సమీర్‌రెడ్డి, కూర్పు: గౌతంరాజు, కళ: ఆనంద్‌ సాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X