‘రచ్చ’ 50 రోజుల పండగ మాత్రం అక్కడే...!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన 'రచ్చ' చిత్రం ఆంధ్రప్రదేశ్ అంతటా రచ్చ చేస్తూ రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటికే తొలి వారం కలెక్షన్ల విషయంలో రామ్ చరణ్ తన మగధీర రికార్డును, రచ్చ సినిమాతో బ్రేక్ చేశాడు. సినిమా ఊపు చూస్తుంటే 100 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకోవడం ఖాయం అన్న చందంగా ఉంది పరిస్థితి. కాగా అంతకంటే ముందుగా జరిగే 50 రోజుల వేడుకను గ్రాండ్ చేసేందుకు దర్శక నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆ మధ్య 'రచ్చ' ఆడియోను కర్నూలులో నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారు. అయితే అప్పుడు పరీక్షల సీజన్ కావడంతో చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుని హైదరాబాద్‌లో వేడుక నిర్వహించారు. ఈ నేపథ్యంలో రచ్చ 50 రోజుల వేడుకను కర్నూలులోనే చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 24 నాటికి ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకోనుంది.
ఈ ఆడియో వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు, పవన్ కళ్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, ఇతర ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాలన్నీ అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
రామ్ చరణ్ తేజ్, మిల్క్ బ్యూటీ తమన్నా జంటగా నటించిన 'రచ్చ' చిత్రం సంపత్ నంది దర్శకత్వంలో మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఎన్వి ప్రసాద్ మరియు పారస్ జైన్ నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు.
బెట్టింగ్ రాజ్ పాత్రలో రామ్ చరణ్ అభిమానుల్ని అలరించాడు. డాన్సుల్లో తన ప్రత్యేక శైలిని చాటుకున్నాడు. ముఖ్యంగా డిల్లకు డిల్లకు పాటలో స్టెప్స్ అలరించాయి. డైలాగ్ డెలివరీలో బాగా పరిణతి సాధించాడు. అభిమానుల్ని అలరించే డైలాగులు చెప్పాడు. దాదాపు అన్ని విభాగాల్లోనూ ప్రేక్షకుల శెభాష్ అనుకున్నాడు.
రచ్చ చిత్రం మాస్ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా. సినిమాలో కొత్తదనం లేకపోయినా మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలు సినిమాను నిలబెట్టాయి. రామ్ చరణ్ నటన, తమన్నా అందాలతో పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రచ్చ చిత్రం ఎక్కువ మందిని ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











