రామ్ చరణ్ ‘రచ్చ’ హైలైట్స్ ఇవే...
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన 'రచ్చ' చిత్రం ఈ రోజు గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రానికి సంబంధించి సూపర్ హిట్ టాక్ బయటకు వచ్చింది. సినిమా మెగా అభిమానులు మెచ్చే మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో చెర్రీ బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్, డాన్స్ ఫైట్స్, ముఖ్యంగా కొన్ని సీన్లలో చిరంజీవిని ఇమిటేట్ చేయడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చరణ్ సరసన తమన్నా ఫర్ ఫెక్టుగా సూటయింది. ఆమె పెర్ఫార్మెన్స్‌కు ఆడియన్స్ నుంచి మంచి మార్కులు పడ్డాయి.
టెక్నికల్ అంశాల విషయానికొస్తే...దర్శకుడు సంపత్ నంది సినిమాను రక్తికట్టించడానికి రొమాంటిక్ సీన్లను, కామెడీని ఎంచుకుని ఫస్ట్ హాఫ్ వినోదాత్మకంగా సాగించి సెకండ్ హాఫ్ లో అసలు స్టోరీ చెప్పాడు. కొన్ని చోట్లు స్క్రీన్ ప్లే స్లోగా ఉన్నప్పటికీ వెంట వెంటనే కవర్ చేశాడు.
ఇక సినిమాలో ఫైట్స్, డాన్సులు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫైట్స్ సూపర్ గా వచ్చాయంటున్నారు ప్రేక్షకులు. ముఖ్యంగా చైనాలో చిత్రీకరించిన బాంబూ ఫైట్ అద్భుతంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మణిశర్మ సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. ముఖ్యంగా 'వాన వాన వెల్లువాయె' సాంగ్ తెరపై మరోసారి చూడటం మంచి ఊపును ఇస్తోంది.
రామ్ చరణ్, తమన్నా జంటగా నటించిన ఈచిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించారు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి ఆర్.బి.చౌదరి సమర్పకులు కాగా, ఎన్.వి.ప్రసాద్, పారస్ జైన్ నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి, రచన: పరుచూరి బ్రదర్స్, ఎడిటింగ్: గౌతంరాజు, కళ: ఆనంద్‌సాయి, కొరియోగ్రఫీ: రాజు సుందరం, శోబి.


Click it and Unblock the Notifications











