వైజాగ్ రైట్స్ లోనూ 'రచ్చ' రచ్చే
రామ్ చరణ్ రచ్చ బిజినెస్ పరంగా ట్రేడ్ వర్గాల్లో రచ్చ చేస్తోంది. తాజాగా ఈ చిత్రం వైజాగ్ రైట్స్ ను పృధ్వీ పిక్చర్స్ వారు రెండు కోట్లకు పైగానే చెల్లించి తీసుకున్నట్లు సమాచారం. ఈ డీల్ కు గీతా ఆర్ట్స్ సపోర్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రచ్చ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. పరాస్ జైన్, ఎన్వీ ప్రసాద్ మెగా సూపర్ గుడ్ ఫిల్మ్ బ్యానర్ పై 'రచ్చ' చిత్రాన్ని రూపొందిస్తుననారు. మణిశర్మ సంగీతం సంగీతం అందిస్తున్నారు.
మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న రచ్చ చిత్రాన్ని మార్చి చివరి వారంలో గాని ఏప్రియల్ నెలలోగానీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆరెంజ్ ప్లాప్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈచిత్రాన్ని చేస్తున్నాడు. 'రచ్చ' ఆడియోను ఈ నెల 11న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల చివరి వారంలోగానీ, ఏప్రిల్ తొలి వారంలోగానీ సినిమా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సమర్పణ: ఆర్.బి.చౌదరి, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి.


Click it and Unblock the Notifications











