పట్టుబడ్డ ‘రచ్చ’ లీకు వీరుడు

By Bojja Kumar

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తాజా సినిమా 'రచ్చ'కు సంబంధించి...ఆడియో విడుదలకు ముందు టైటిల్ సాంగ్ లీకైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పాటను అప్ లోడ్ చేస్తున్న వ్య్తక్తి పట్టుబడ్డాడు. యాంటీ పైరసీ సెల్ ఆంద్రప్రదేశ్ విభాగానికి చెందిన అధికారులు పథకం ప్రకారం సదరు వ్యక్తిని పట్టుకున్నారు. ఈ విషయాన్ని యాంటీ వీడియో పైరసీ సెల్ చైర్మన్ రాజ్ కుమార్ ధృవీకరించారు. పైరసీకి అవాయిడ్ చేయాలని, పైరసీ సినిమాలు అమ్మినా, కొన్నా, డౌన్ లోడ్ చేసినా నేరమే అని ఆయన హెచ్చరించారు.

రామ్ చరణ్ తేజ-తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న 'రచ్చ' సినిమా ఆడియో ఫిబ్రవరి 26న కర్నూలులో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ చేతుల మీదుగా ఈ చిత్ర ఆడియోను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కర్నూలోని ఎస్.టి.బి.బి.సి కాలేజ్ గ్రౌండ్స్ రచ్చ ఆడియో వేడుకకు వేదిక కానుంది. ఆరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఫంక్షన్ ప్రారంభం కానుంది.

ఈ సినిమాలో రామ్ చరమ్ మెడికోగా కనిపించనున్నారు. కారు రేసుల బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుంది. అందులో రామ్ చరణ్ పేరు విశ్వం. మాస్ మసాలా, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పరాస్ జైన్, ఎన్.వి.ప్రసాద్ మెగా సూపర్ గుడ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X