»   » సిక్ లీవుల్లో రామ్ చరణ్ యూనిట్

సిక్ లీవుల్లో రామ్ చరణ్ యూనిట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చ షూటింగ్ ప్రస్తుతం ధాయల్యాండ్ లో జరుగుతోంది.అక్కడకి వెళ్ళిన దగ్గరనుండి చిత్రంలోని యూనిట్ సభ్యులంతా రోజుకు కొందరు చొప్పున సిక్ లీవ్ లు పెడుతున్నట్లు సమాచారం.వాతావరణం ఛేంజ్ వల్ల సిక్ అవుతున్నారని మొదట అనుకున్నా ఆ తర్వాత వారు సిక్ లీవ్ లు పెట్టి సిటిని చుట్టి రావటం,అక్కడ మసాజ్ పార్లర్ కి వెళ్లటం వంటివి చేస్తున్నట్లు వినపడుతోంది.అయితే దర్శకుడు,హీరో,కెమెరామెన్ మాత్రం వీటికి దూరంగా ఉండి ఎలాగైనా చిత్రాన్ని హిట్ చేయాలనే తలంపుతో రాత్రింబవళ్ళు కష్టపడుతున్నట్లు చెప్పుకుంటున్నారు.అయితే అంత దూరం వెళ్ళాక సిక్ లీవ్ లు పెడుతూంటే ఎవరినీ ఏమి అనలేని పొజీషన్ అని,ఆరోగ్యం విషయంలో ఎవరినీ మందలించలేము కదా అని అంటున్నారు.

ఇక మెగా సూపర్‌గుడ్‌ పతాకంపై ఎన్వీ ప్రసాద్‌, పారస్‌ జైన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏమైంది ఈ వేళ చిత్రంతో దర్శకుడుగా మారిన సంపత్‌ నంది ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. అలాగే ఈ సినిమా కోసం కళా దర్శకుడు ఆనంద్‌సాయి ప్రత్యేకంగా ఓ సెట్‌ని తీర్చిదిద్దారు. వందశాతం మాస్‌ చిత్రమిదని,కమర్షియల్ అంశాలతో కూడిన చరణ్‌ పాత్ర తప్పకుండా అన్ని వయసులవారికీ నచ్చుతుందని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ఈ చిత్రానికి సమర్పణ: ఆర్‌.బి.చౌదరి, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి.

English summary
Except Ram Charan, director Sampath Nandi and cinematographer, others are enjoying the Thailand schedule.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu