రాధ కూతురు ఏడుపు
నాగ చైతన్యతో చేసిన 'జోష్' ఫెయిల్యూర్ కావటంతో అందులో చేసిన రాధ కూతురు కార్తీక చాలా బాధపడుతోందంటూ తమిళ పత్రికలు ఊదరకొడుతున్నాయి. అందులోనూ ఈ చిత్రం రిలీజ్ అనంతరం వరస ఆఫర్స్ ఎక్సపెక్ట్ చేసిన ఆమెను ఈ విషయం చాలా కృంగతీసిందని అంటున్నారు. అంతేగాక కార్తీక తన స్నేహితురాళ్ళ వద్ద ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పిందని వాళ్లు ఈ సిట్యువేషన్ చూసి నవ్వుతారని ఆమె ఫీలవుతున్నట్లుగా చెప్తున్నారు. ఇక రాధ మాత్రం ఇవన్నీ ఈ గ్లామర్ ఫీల్డ్ లో చాలా కామన్ అని ఓదార్చి మరో ఆఫర్ కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఉందని తెలుస్తోంది. తమిళంలో ట్రై చేద్దామంటే ఇప్పటికే అక్కడ కార్తీక నటించి మూడు సినిమాలు రిలీజ్ కాక డబ్బాల్లో మూలుగుతున్నాయని సమాచారం. దాంతో ఇక్కడే ఎలోగోలా మరో కుర్ర హీరో ప్రక్క ఛాన్స్ సంపాదించాలని చూస్తోందని తెలుస్తోంది. అందుకోసం తన పాత పరిచయాల్నీ తిరగతోడుతోందని అంటున్నారు. అయితే ఒకళ్ళిద్దరు కొత్త వారు కార్తీక కోసం ఎంక్వైరీ చేసినా డేట్స్ ఖాలీ లేవని రాధ తిప్రికొట్టిందని తెలుస్తోంది. మొత్తానికి మళ్లీ పెద్ద బ్యానర్ ద్వారానే కూతురుకి లైఫ్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తోందన్నమాట.


Click it and Unblock the Notifications











