అందుకే రాధ కూతురు

ఈలోగా నాగచైతన్య సినిమాలో కొత్త హీరోయిన్ కావాలి అనిపించినప్పుడు పాత్ర ప్రకారం కాస్త నృత్యంలో ప్రవేశం ఉన్న అమ్మాయైతే బావుంటుందని చాలా మందిని చూసారు. అయితే ఎవరూ సెట్ కాలేదు.ఇక కొత్త బంగారు లోకం అమ్మాయినే కన్ఫర్మ్ చేద్దామనుకునే సరికి తెలిసున్న వారి ద్వారా రాధ కూతురు ప్రస్తావన వచ్చింది. వెంటనే ఫోటో షూట్ చేసి ఓకే చేసారు. ఎందుకంటే ఆమెకు భరత నాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది.
అందులోనూ పాత పరిచయాలు కూడా కావటంతో వెంటనే మెటీరియలైజ్ అయ్యింది.అయితే రెండో హీరోయిన్‌గా "కొండంత బంగారు లోకం' ఫేమ్ శ్వేత బసు ప్రసాద్ నటించనున్నారని సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పరిచయ దర్శకుడు వాసువర్మ తెరకెక్కించనున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు రాజస్థాన్‌లో జరుగుతున్నాయి.
movies telugu naga chaitanya karthika radha nagarjuna swetha prasad నాగార్జున రాధ నాగచైతన్య కార్తీక


Click it and Unblock the Notifications