ఇషా ఛావ్లాతో రొమాన్స్ కోసం సునీల్ రష్యాకు
ఓ పక్క హాస్య పాత్రలను పోషిస్తూ, మరోపక్క కథానాయకుడిగా నటిస్తూ కెరీర్‌ను ఓ ప్లానింగ్‌గా మలచుకుంటున్నారు సునీల్. బిజీ హాస్యనటుడిగా ఉన్న ఆయన 'అందాల రాముడు' చిత్రంతో కథానాయకుడిగా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 'మర్యాదరామన్న', 'కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అప్పల్రాజు', 'పూలరంగడు' తదితర చిత్రాలు చేసిన ఆయనకు 'అప్పల్రాజు' చిత్రం తీవ్ర నిరాశనే మిగిల్చింది. 'పూలరంగడు' విజయంతో ఆయన పాపులార్టీ మరింతగా పెరిగింది. గతంలో హీరో గా చేసేందుకు మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్నా, ఇప్పుడేమో కథలను బట్టి వరుసగా చిత్రాలు చేసేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తంచేస్తున్నారు.
ప్రముఖ చిత్ర నిర్మాణసంస్థ మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ సునీల్, ఇషాచావ్లా జంటగా దేవిప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాధాకృష్ణుడు' కు మంచి క్రేజ్ ట్రేడ్ లో వస్తోంది. హిందీలో ప్రేక్షకాదరణ చూరగొన్న 'తను వెడ్స్ మను' అనే చిత్రాన్ని తెలుగులో పునర్నర్మిస్తున్న నేపథ్యంలో దీనికి ఏం టైటిల్ పెడతారోనని సినీ ఆస్వాదకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రం సునీల్ సినీఖాతాలో ఇంకో హిట్‌ను నమోదు చేసుకుంటుందన్న అభిప్రాయాన్ని దర్శక, నిర్మాతలు వ్యక్తంచేస్తున్నారు.


Click it and Unblock the Notifications












