For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  "శ్రీరెడ్డికి‌ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేవారు లేరు... కోట్లు ఎలా సంపాదించింది?"

  By Bojja Kumar
  |

  ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఇష్యూపై శ్రీరెడ్డి చేసిన అర్దనగ్న ప్రదర్శన సంచలనం అయిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి చర్యను పలువురు సీనియర్ ఆర్టిస్టులు తప్పబట్టారు. తాజగా ప్రముఖ నటి రాధా ప్రశాంతి శ్రీరెడ్డి తీరుపై మండి పడ్డారు. ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినీ పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ అంశం, శ్రీరెడ్డి అర్దనగ్న ఆందోళన ప్రస్తావనకు రాగా..... రాధా ప్రశాంతి తనదైన రీతిలో రియాక్ట్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీతో పాటు ఏ ఇండస్ట్రీలో అయినా మంచి, చెడు ఉంటుంది.... ఏ దారిలో వెళ్లాలనే ఆప్షన్ మన చేతిలోనే ఉంటుందని రాధా ప్రశాంతి తెలిపారు.

  Sri Reddy Controversial Comments On Daggubati Rana And Trisha
  తెలిసి వెదన పనులు చేయడం ఎందుకు?

  తెలిసి వెదన పనులు చేయడం ఎందుకు?

  మనం చేసే పని చెడు అని తెలిసి కూడా వెదవ పనులు చేయడం ఎందుకు? చేసేదంతా చేసి అన్నీ అయిపోయాక మీడియా ముందుకొచ్చి గుడ్డలూడదీసుకుని మా దగ్గరికి వాళ్లొచ్చారు, వీళ్లొచ్చారు అని అనడం ఎందుకు? మీకు తెలుసు వారు ఎందుకు వస్తున్నారో? మరి మీరెందుకు వారిని దగ్గరకు రాణిస్తున్నారు? సినిమా ఫీల్డుకు వచ్చేపుడు అన్నీ తెలుసుకునే వస్తారు. మొదట్లో తెలియక పోయినా... అనుభవంతో అయినా తెలుస్తుంది కదా?.... అన్నీ తెలుసే ఎందుకు కమిట్మెంట్ ఇస్తున్నారు? అని రాధా ప్రశాంతి మండి పడ్డారు.

  అంతా మీ చేతుల్లోనే ఉంటుంది

  అంతా మీ చేతుల్లోనే ఉంటుంది

  వారు అడగ్గానే కమిట్మెంటుకు సిద్ధమవుతున్న మీరు వాళ్ల దగ్గర డబ్బు తీసుకుంటున్నారో? వేషం కోసం కమిట్ అవుతున్నారో?.... ఏది ఎలా జరిగినా మీ ఇష్టంతోనే జరుగుతుంది అనేది ఎవరూ కాదనలేని నిజం. అన్నీ అయిపోయిన తర్వాత గుడ్డలూడదీసుకుని నాకు న్యాయం చేయండి, క్యారెక్టర్ ఇస్తామని నన్ను వాడుకున్నారు అని ఆరోపణలు చేయడం కంటే ముందే అందుకు కమిట్ కాకుండా ఉండాల్సింది అని రాధా ప్రశాంతి అభిప్రాయ పడ్డారు.

  తప్పించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి

  తప్పించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి

  ఇండస్ట్రీలో కమిట్మెంటు అడిగే వారి నుండి తప్పించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కేవలం టాలెంటు చూసి అవకాశాలు ఇచ్చే దర్శకులు, నిర్మాతలు చాలా మంది ఉన్నారు. మనం తీసుకునే నిర్ణయాలపైనే ఇది ఆధారపడి ఉంటుంది అని రాధా ప్రశాంతి తెలిపారు.

  ఇక్కడ ఎవరూ ఎత్తుకెళ్లి రేప్ చేయరు

  ఇక్కడ ఎవరూ ఎత్తుకెళ్లి రేప్ చేయరు

  సినిమా ఇండస్ట్రీలో ఎవరూ ఎవరినీ బలవంతం చేయరు. మనల్ని ఎత్తుకుపోయి బలాత్కారం చేస్తే అది పెద్ద క్రైమ్. దానికి వెళ్లి మీరు రిపోర్ట్ చేయవచ్చు. కానీ ఇపుడు ఇండస్ట్రీలో కొందరు లేడీసే మగాళ్లను రెచ్చగొడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయని రాధా ప్రశాంతి తెలిపారు. మగాళ్లలో కోరికలైతే ఉంటాయి. చచ్చేంత వరకు ఉంటాయి. మనం పోవాలా? లేదా? అనేది మన చేతుల్లో ఉంటుంది... అని రాధా ప్రశాంతి తెలిపారు.

  శ్రీరెడ్డికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చే వారు లేరు

  శ్రీరెడ్డికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చే వారు లేరు

  గుడ్డలూడ దీసుకున్న శ్రీరెడ్డి విషయంలో ఎవరూ ముందుకు రాక పోవడం వల్లనే ఇంత పెద్ద ఇష్యూ అయింది. ఆ ఇష్యూ వచ్చినపుడు ముందుకొచ్చి శ్రీరెడ్డి లాంటి వారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చే పెద్ద మనిషి ఇండస్ట్రీలో లేక పోవడం మన దురదృష్టం. దాసరి గారు ఉంటే ఇలా జరిగేది కాదు... అని రాధా ప్రశాంతి అభిప్రాయ పడ్డారు.

  పెద్ద బంగ్లా, కోటిన్నర కారు ఎలా వచ్చాయి?

  పెద్ద బంగ్లా, కోటిన్నర కారు ఎలా వచ్చాయి?

  రెండు మూడు సినిమాలు చేసి పెద్ద బంగ్లా, కోటిన్నర ఆడి కారు.... ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి. మాకు కూడా అలాంటి కార్లు లేవు. తొక్కలో సాంట్రో కారులో తిరుగుతున్నాను. వంద సినిమాల్లో నేను నటించాను. హిందీ సినిమాల్లో కూడా సెకండ్ హీరోయన్ గా చేశాను. సోనీ ఛానల్‌లో ‘స్వప్నసుందరి' సీరియిల్‌లో మెయిన్ హీరోయిన్ గా చేశాను. మాకే అలాంటి కార్లు కొనే సంపాదన లేదు, మరి శ్రీరెడ్డికి ఎక్కడి నుండి వచ్చాయి? అని రాధా ప్రశాంతి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

  English summary
  Tollywood Senior Actor Radha Prasanthi sensational Comments On Sri Reddy. In an attempt to protest against casting couch and sexual exploitation in Tollywood, a Telugu actress Sri Reddy stripped in public. Regarding this issue, Radha Prasanthi criticised Sri Reddy.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more