ఇండియాలో ఫస్ట్ టైం ఇలా... ‘రాధేశ్యామ్’కు నార్త్, సౌత్ సెగ.. అందుకే అలా!
రాధేశ్యామ్ సినిమా గురించి నిత్యం ఏదో ఒక చర్చ జరుగుతూనేఉంటుంది. సినిమా ప్రారంభించి ఏడాది దాటి పోయినా అప్డేట్ లేదంటూ నిర్మాణ సంస్థపై దుమ్మెత్తిపోశారు ఫ్యాన్స్. సినిమా ప్రారంభించి పూర్తి కావొస్తున్నా కూడా మ్యూజిక్ డైరెక్టర్‌ను ప్రకటించలేదని అభిమానులు ఆందోళన చెందారు. యూవీ సంస్థను ఏకిపారేశారు.అయితే ఆమధ్య లాక్డౌన్ కాలంలో మ్యూజిక్ డైరెక్టర్ పేరును ప్రకటించారు. డియర్ కామ్రేడ్ ఫేమ్ జస్టిన్ ప్రభాకరన్‌ను రాధేశ్యామ్ సంగీత దర్శకుడిగా ప్రకటించారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చారు.

జస్టిన్ ప్రభాకర్‌తో అలా..
మొదటగా రాధేశ్యామ్ సినిమాకు జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం అందిస్తాడని ప్రకటించారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయాడు. ఇలా కుర్రవాడికి ఇవ్వడంతో డార్లింగ్ ఫ్యాన్స్ సైతం నోరెళ్లబెట్టారు. డియర్ కామ్రేడ్ ఫలితం ఎలా ఉన్నా కూడా ట్యూన్స్, సంగీతం బాగానే ఆకట్టుకుంది. అలా జస్టిన్.. రాధేశ్యామ్‌కు జస్టిస్ చేస్తాడని భావించారు.

తాజాగా ఇలా..
అయితే తాజాగా మళ్లీ ఓ మెలికపెట్టారు. జస్టిన్ ప్రభాకర్ ఇప్పటికే సంగీత దర్శకుడిగా ఫిక్స్ అయ్యాడు. అయితే ఈయన కేవలం దక్షిణాది భాషల్లో విడుదలయ్యే రాధేశ్యామ్ చిత్రానికి మాత్రమే సంగీతాన్ని అందిస్తాడు. బాలీవుడ్‌లో రాబోతోన్న రాధేశ్యామ్‌కు సపరేట్ సంగీత దర్శకులను ఫిక్స్ చేశారట.

ఇండియాలోనే మొదటి సారి..
అయితే ఇలా ఒకే సినిమాకు ఇద్దరు దర్శకులు పని చేయడం కొత్తేమీ కాదు. కానీ ఇలా వేర్వేరు మ్యూజిక్, వేర్వేరు పాటలు ఒకే సినిమాలో ఒక ప్రాంతంలో వేరుగా మరో ప్రాంతంలో ఇంకోలా ఉండటం మాత్రం ఇదే మొదటి సారి. ఈ విషయాన్ని మేకర్స్ కూడా ప్రకటించారు. అయితే సంగీతం వేరు అయినా ఫీల్ మాత్రం అలానే ఉంటుందని చెప్పుకొచ్చారు.

లిరిక్స్ అలా..
అయితే సౌత్‌లో ఉండే పాటలకు కృష్ణకాంత్ సాహిత్యాన్నిఅందిస్తాడని, మిథూన్ రెండు పాటలను కంపోజ్ చేస్తాడు.. మనన్ మరో పాటకు ట్యూన్ కడతాడని పేర్కొన్నారు. బాలీవుడ్ ప్రముఖులైన కుమార్, మనోజ్ ముంథాస్సిర్.. వంటి వారు సాహిత్యాన్ని అందించనున్నారని చెప్పుకొచ్చారు.

జస్టిన్ పనితనం నచ్చకేనా?
అసలే ఇప్పుడు రాధేశ్యామ్ టీజర్‌తో అందరికీ స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయింది చిత్రయూనిట్. అయితే జస్టిన్ కొట్టిన ట్యూన్స్ బాలీవుడ్‌కు సరిగ్గా ఎక్కవనే ఉద్దేశంతోనే ఇలా చేశారా? అని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. అందుకే ఇలా సౌత్, నార్త్ అంటూ సంగీత దర్శకులను పెట్టారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











