For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సూసైడ్ చేసుకుంటానన్న ప్రభాస్ ఫ్యాన్.. వచ్చి కొడతానన్న రాధేశ్యామ్ డైరెక్టర్.. రిలీజ్ ఎప్పుడో చెప్పేశాడుగా !

  |

  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా రిలీజ్ లేట్ అవుతున్న క్రమంలో రాధేశ్యామ్ దర్శకుడు ఫాన్స్ తో ఒక చాట్ సెషన్ నిర్వహించారు. అందులో అనేక విషయాలు పంచుకున్నారు. ఇక సూసైడ్ చేసుకుంటానన్న ఒక ఫ్యాన్ కు వర్కింగ్ ఇచ్చారు. ఆ వివరాలు

  ఓకే సినిమా కోసం

  ఓకే సినిమా కోసం


  బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్. ఆ తర్వాత సాహో సినిమాతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ సినిమా కోసం ఇటు తెలుగు ఆడియన్స్ తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియాలో మరో సినిమాకు సాధ్యం కాని స్థాయిలో ఓకే సినిమా కోసం రెండు డిఫరెంట్ మ్యూజిక్ టీమ్స్ వర్క్ చేశాయి. సౌత్, నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా అత్యున్నత సంగీత దర్శకులతో పాటలు సిద్ధం చేయిస్తున్నారు.

  రాధేశ్యామ్ గురించి

  ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తైపోగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు దర్శక నిర్మాతలు. రాధేశ్యామ్ సినిమా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ప్రకటించారు కానీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమాను వాయిదా వేశారు. రాధేశ్యామ్ సినిమా సమ్మర్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా దర్శకుడు అభిమానులతో ట్విట్టర్ లో చాట్ సెషన్ నిర్వహించారు. హలో డార్లింగ్స్, రెబెల్స్ మరియు డై హార్డ్ అభిమానులు. త్వరగా కొన్ని ప్రశ్నలు అడగండి ఈ థ్రెడ్ లో !! నేను తదుపరి 30 నిమిషాల్లో నాకు వీలైనంత ఎక్కువ సమాధానాలు ఇవ్వాలనుకుంటున్నాను, అంటూ రాధేశ్యామ్ గురించి అడగమని కోరారు.

  అన్నీ పాస్ అయ్యిపోయాను

  అన్నీ పాస్ అయ్యిపోయాను

  దానికి ఒక ఫ్యాన్, హలో డైరెక్టర్ రాధ అన్న రిప్లై ఇవ్వకపోతే సూసైడ్ లెటర్ రాసుకుంటా అని అన్నాడు. దానికి రాధాకృష్ణ కుమార్ ఇలా బెదిరిస్తే వచ్చి బమ్స్(సీట్) మీద కొడతా అని పేర్కొన్నాడు. మరొకరు లవ్ ఫైల్యూరా మామా నువ్వు, ఒకవేళ కాకపోతే ఎంత మందిని పడేసావ్ చెప్పు, చిట్కాలు ఏమైనా ఇవ్వు మామా అని పేర్కొన్నాడు. అన్నీ పాస్ అయ్యిపోయాను అదే సమస్య అని రాధాకృష్ణ కుమార్ పేర్కొన్నారు.

   మేము నిర్ధారించుకున్నప్పుడే

  మేము నిర్ధారించుకున్నప్పుడే

  మీరు సినిమా ఎప్పుడు విడుదల చేస్తారు సార్ ?? అని ఆడగగా థియేటర్లలోకి రావడానికి అంతా బాగానే ఉందని మేము నిర్ధారించుకున్నప్పుడని రాధాకృష్ణ కుమార్ పేర్కొన్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు, "త్వరలో" హా అన్నా, అంటే అవును అతి త్వరలో అని రాధాకృష్ణ కుమార్ పేర్కొన్నారు. ప్రేరణ కి యాటిట్యూడ్ ఎక్కువ అంట నిజమేనా బ్రదర్ అంటే ఆమె స్వీట్ హార్ట్ మరియు నిజమైన ప్రొఫెషనల్ అని రాధాకృష్ణ కుమార్ పేర్కొన్నారు. కృష్ణంరాజు గారి గురించి ఒక్క మాట అన్నా? అని అడగగా పరమహంస అని రాధాకృష్ణ కుమార్ పేర్కొన్నారు.

   చూసిన దాని కన్నా అద్భుతం గా

  చూసిన దాని కన్నా అద్భుతం గా

  ఇది పాన్ ఇండియా సినిమా.. మరియు మీరు ఏ ఉత్తర భారత అభిమానులకు రిప్లై ఇవ్వలేదు... చాలా బాగుంది... కొనసాగించండి అని ఒకరు అసహనం వ్యక్తం చేయగా బ్రో!! చిల్ త్వరలో థియేటర్లలో కలుద్దాం అని రాధాకృష్ణ కుమార్ సమాధానం ఇచ్చారు. ప్రభాస్ అన్న లుక్స్ ఎలా ఉంటాయి సినిమాలో అని అడిగితే నువ్వు ఇప్పటివరకు చూసిన దాని కన్నా అద్భుతం గా ఉంటాయి అని రాధాకృష్ణ కుమార్ పేర్కొన్నారు. అన్న రాధేశ్యామ్ కథ మీద మీ విశ్వాసం ఒక్క మాటలో చెప్పు అంటే కథ మరియు ప్రభాస్ అని రాధాకృష్ణ కుమార్ పేర్కొన్నారు.

  కోటి దుఃఖాలను చిరునవ్వుతో పోగొట్టి

  కోటి దుఃఖాలను చిరునవ్వుతో పోగొట్టి

  ప్రభాస్ అన్న గురించి ఒక్క మాట అని అడిగితే కోటి దుఃఖాలను చిరునవ్వుతో పోగొట్టి ప్రపంచాన్ని అందమైన ప్రదేశంగా మార్చ గల వ్యక్తి అని అని రాధాకృష్ణ కుమార్ పేర్కొన్నారు. మా UV క్రియేషన్స్ గురించి ఏదైనా చెప్పండి, ప్రమోద్ మరియు వంశీల గురించి అని అడిగితే బ్లడ్ బ్రదర్స్ కంటే ఎక్కువ అని రాధాకృష్ణ కుమార్ పేర్కొన్నారు. నీ మీద మేము చేసే మేమ్స్ చూస్తావ్ గా అన్నా, ఏంటి రియాక్షన్ లేదు, బై ది వే ఏవీ కేవలం మా ప్రేమ తోనే చేస్తాం అని అంటే అవే నా స్ట్రెస్ బస్టర్స్ అని ఆయన పేర్కొన్నారు.

  English summary
  Radhe shyam director Radha krishna kumar gave funny reply to prabhas fan who said to commit suicide.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion