Radhe Shyam: ప్రభాస్ సినిమా కోసం ఇద్దరు అభిమానులు మృతి.. దారుణమైన నిర్ణయంతో సూసైడ్!

అభిమానం అనేది ఇటీవల కాలంలో కాస్త హద్దులు దాటుతుంది అనే కామెంట్స్ చాలా వస్తున్నాయి. ఏ స్టార్ హీరో అయినా సరే కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ను చాలా ఇష్టపడతారు. కానీ ఈ రోజుల్లో మాత్రం కొంత మంది హీరోలు అభిమానులను చూస్తుంటే చాలా భయంగా ఉంది అనే పరిస్థితుల్లోకి వచ్చేశారు. అంతేకాకుండా అభిమానులు వారికి ఇష్టమైన హీరోలను ఏమైనా అంటే మాత్రం అసలు తట్టుకోవడం లేదు.

ఇక ఇటీవల ప్రభాస్ అభిమాను ఇద్దరు వివిధ కారణాల వకన మరణించడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది. కర్నూలు జిల్లాలో జరిగిన ఒక సూసైడ్ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇతర అభిమానులను కూడా కలచివేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఎంత దూరమైనా..

ఎంత దూరమైనా..

ఇటీవల కాలంలో సినిమా అభిమానుల్లో హీరోలపై పెరుగుతున్న అభిమానం అంతా ఇంతా కాదు. వారి కోసం ఎంత దూరమైనా రావడానికి సిద్ధంగానే ఉన్నామని అభిమానులు చాలా సార్లు రుజువు చేశారు. ఎక్కడ ఈవెంట్స్ జరిగినా కూడా దూరం ఎంత ఉంది అని లెక్కచేయకుండా కొంత మంది ఫ్యాన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వెళుతూ ఉంటారు. వారికి ఇష్టమైన హీరో సినిమా రిలీజవుతుందంటే సొంత ఖర్చులతో థియేటర్స్ ను ముస్తాబు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

మితిమీరి పోయే విధంగా..

మితిమీరి పోయే విధంగా..

హీరోల పై ప్రేమను చూపించడం వరకు అయితే మంచి విషయమే అని చెప్పాలి. కానీ కొందరు మాత్రం ఆ ప్రేమ విషయంలో మితిమీరి పోయే విధంగా ప్రవర్తిస్తున్నారు. కొన్నిసార్లు ప్రాణాలను కూడా లెక్క చేయక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వారికి నచ్చిన హీరోను ఎవరైనా ఏమైనా అంటే గొడవలు పడే వెళ్తున్నారు. పలు సందర్భాల్లో కొంతమంది అభిమానులు చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి.

ఇలా చేయడం కరెక్ట్ కాదు

ఇలా చేయడం కరెక్ట్ కాదు

రీసెంట్ గా ప్రభాస్ సినిమా కోసం మరొక యువకుడు ఆత్మహత్య చేసుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. కర్నూలులో జరిగిన ఈ దారుణమైన ఘటన సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఎంతమాత్రం ఇలాంటి దారుణాలకు పాల్పడడం కరెక్ట్ కాదు అని ఇతర అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు.

అలాంటి టాక్ వచ్చిందని ఆత్మహత్య

అలాంటి టాక్ వచ్చిందని ఆత్మహత్య

ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు మొదట చాలా నిరుత్సాహపరిచే విధంగా టాక్ వచ్చిందని సినిమా ఫ్లాప్ అయిందని కూడా అనిపించడంతో కర్నూలుకు చెందిన ముత్యాల రవితేజ అనే అభిమాని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

రవితేజ అలా ఆత్మహత్య చేసుకోవడంతో లాభం ఏమిటి అని ఇప్పుడు వారి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటి అని తోటివారు అభిప్రాయపడుతున్నారు. అభిమానం అనేది మంచిదే కానీ దాన్ని ప్రాణం మీదకు తెచ్చుకున్న అంత అభిమానం పెంచుకోవడం కూడా సరైనది కాదు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

Recommended Video

Radhe Shyam - Prabhas Interview | Pooja Hegde| Filmibeat Telugu
థియేటర్ వద్ద మరో అభిమాని మృతి

థియేటర్ వద్ద మరో అభిమాని మృతి

అంతే కాకుండా ఇటీవల రాధే శ్యామ్ సినిమా విడుదలవుతున్న సందర్భంగా రైల్వే కొడూరు థియేటర్ ముందు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటు ఉండగా అపశ్రుతి నెలకొంది. ఒక బస్సు స్కూటర్ ను డీ కొట్టడంతో అభిమాని తీవ్ర స్థాయిలో గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకు వెళ్లినప్పటికీ చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందాడు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏదేమైనా ప్రభాస్ సినిమా విసుదలైన సందర్భంలో రెండు నిండు యువ ప్రాణాలు కోల్పోవడం వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X