Radhe Shyam First Review: ఫస్ట్ హాఫ్ లో మిస్టరీ.. ప్రభాస్ క్యారెక్టర్ అద్భుతం.. కానీ..

ప్రభాస్ అభిమానులు రాధే శ్యామ్ సినిమా మొదటి రోజు మొదటి షో చూడాలి అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టాక్ ఫస్ట్ రివ్యూ ఎలా ఉంటుంది అని విషయం కూడా అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది.

అయితే ఈ సినిమా సెన్సార్ సభ్యుల నుంచి కూడా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇక అందరికంటే ముందుగా దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు రాధే శ్యామ్ పై తన ఫస్ట్ రివ్యూ ఇచ్చేసాడు. ఇక సినిమా ఎలా ఉంది అన్న వివరాల్లోకి వెళితే.

సెన్సార్ పనులు పూర్తి

సెన్సార్ పనులు పూర్తి

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ గా సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. అతని నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా ఈ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక రాధే శ్యామ్ సినిమా మొత్తానికే విడుదలకు ముందే భారీగా అంచనాలను క్రియేట్ చేసింది.

సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. 2:18 నిడివిగల ఈ సినిమాకు సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ లబించింది. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది అని చిత్ర యూనిట్ సభ్యులు నమ్ముతున్నారు.

దుబాయ్ నుంచి ఫస్ట్ రివ్యూ

దుబాయ్ నుంచి ఫస్ట్ రివ్యూ

ఇక సినిమాను చూసిన వారు ఇప్పటికే చాలా పాజిటివ్ గా స్పందించే ప్రయత్నం చేస్తున్నారు. అందరికంటే ముందుగా దుబాయి సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సందు సినిమాను చూసి తన మొదటి రివ్యూ కూడా అందించే ప్రయత్నం చేశాడు.

ఉమైర్ సందు రాధే శ్యామ్ సినిమా గురించి క్లుప్తంగా వివరణ ఇస్తూ చాలా పాజిటివ్ గా స్పందించడం విశేషం. దీంతో అతని మొదటి రివ్యూతో ఓవర్సీస్ లో కూడా సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి.

ఫస్ట్ హాఫ్ లో మిస్టరీ

ఫస్ట్ హాఫ్ లో మిస్టరీ

రాధేశ్యామ్ ఫస్ట్ హాఫ్ చూసిన అనంతరం ఉమైర్ సందు సినిమా బాగా కనెక్ట్ అయినట్లుగా స్పందించాడు. ముఖ్యంగా సినిమాలో VFX అద్భుతంగా ఉందని ప్రభాస్ పూజా హెగ్డే కెమిస్ట్రీ కూడా అద్భుతంగా ఉందని అన్నారు. ఫస్ట్ హాఫ్ ట్విస్ట్ లో మిస్టరీ కొనసాగుతోంది అని ఇదొక యూనిక్ సబ్జెక్ట్ అని వివరణ ఇచ్చారు.

 ప్రభాస్ క్యారెక్టర్

ప్రభాస్ క్యారెక్టర్

ప్రభాస్ స్టైల్ గురించి మాట్లాడుతూ.. క్లాస్ స్టైల్ లో ప్రభాస్ ను ఎవరు బీట్ చేయలేరు అంటూ అతని స్వాగ్ నటన కూడా అద్బుతమని ఫైనల్ గా సినిమా మొత్తం చూస్తుంటే అతనికి ఫిదా అయిపోయి లవ్ చేస్తారని కూడా తెలిపారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో ఒక పామిస్ట్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే.

బెస్ట్ సినిమా..

బెస్ట్ సినిమా..

రాధే శ్యామ్ సినిమా మిమ్మల్ని తప్పకుండా సర్ ప్రైజ్ చేస్తుంది. టెక్నికల్గా 2022లోనే ఇది బెస్ట్ సినిమా VFX ప్రొడక్షన్ డిజైనింగ్, కాస్ట్యూమ్స్, స్క్రీన్ ప్లే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ప్రతీ ఒక్కటి కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ముఖ్యంగా పూజా హెగ్డే ప్రభాస్ కెమిస్ట్రీ సూపర్ హాట్ అంటూ ప్రభాస్ రియల్ పాన్ ఇండియా స్టార్ అని ఉమైర్ వివరణ ఇచ్చారు.

Recommended Video

Radhe Shyam కి ఆ మైండ్ సెట్ తో వస్తేనే అంచానాలు అందుకుంటుంది | Prabhas | Filmibeat Telugu
కావాలని నెగిటివ్ రివ్యూలు

కావాలని నెగిటివ్ రివ్యూలు

ఇక ఉమైర్ మరొక ట్వీట్ లో సినిమా బాగానే ఉంది కాని బాలీవుడ్ మాఫియా మీడియా అలాగే ఎ లిస్టర్ స్టార్స్ PR ఏజెన్సీలు రాధేశ్యామ్‌కి నెగిటివ్ రివ్యూలు వచ్చేలా చేస్తున్నాయని సాహో తరహాలోనే హిందీలో తప్పుడు ప్రచారాలు కొనసాగుతున్నట్లు ఉమైర్ ఆరోపించారు. ఇక ప్రభాస్‌కు నమ్మకమైన అభిమానులు ఉన్నారు అనడంలో సందేహం లేదు అని కూడా అతను ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X