Radhe Shyam First Review: రాధేశ్యామ్ లో 12 నిమిషాల కీలక ఎపిసోడ్.. సముద్రం మధ్యలో ప్రభాస్ మ్యాజిక్!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ మార్కెట్ ను కూడా అమాంతంగా పెంచేస్తున్నాడు. ఒకప్పుడు 100కోట్ల సినిమా అంటేనే చాలా పెద్ద సినిమా అని ఆశ్చర్యపోయేవారు. కానీ ఇప్పుడు ప్రభాస్ మాత్రం చాలా సునాయసంగా ఐదు వందల కోట్ల వరకు తీసుకు వచ్చాడు. చూస్తుంటే భవిష్యత్తులో ఆ సంఖ్య మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాపై ప్రస్తుతం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ వైరల్ గా మారుతొంది. ఆ సినిమాలో 12 నిమిషాల పాటు కొనసాగే ఒక హైలెట్ ఎపిసోడ్ సినిమాల్లో చాలా కీలకం కానుందట.

అందరి ఫోకస్ దానిపైనే

అందరి ఫోకస్ దానిపైనే

బాహుబలి సినిమా అనంతరం ప్రభాస్ లెవెల్ ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయికి పెరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన సాహో సినిమా తో కూడా ప్రభాస్ నార్త్ ఇండియాలో కూడా తన మార్కెట్ ను ఒక్కసారిగా పెంచేసుకున్నాడు. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ ప్రభాస్ మార్కెట్ అయితే 300 కోట్లు ఈజీగా దాటి పోయినట్లు అర్థమయింది. ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ కూడా రాధేశ్యామ్ సినిమాపైనే ఉంది.

సినిమాలో ఎదో ఉంది

సినిమాలో ఎదో ఉంది

రాధేశ్యామ్ సినిమాతో ప్రభాస్ ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాపై ప్రస్తుతం అంచనాలు మామూలుగా లేవు. అయితే కేవలం ప్రభాస్ డిఫరెంట్ షేడ్స్ లో నటిస్తున్నాడు అనే పాయింట్ తప్ప చిత్రయూనిట్ ఇంతవరకు ఇతర విషయాల్లో పెద్దగా హైప్ అయితే క్రియేట్ చేయలేదు. టీజర్ అయితే పర్వాలేదు అనిపించింది. తప్పకుండా సినిమాలో ఎదో స్పెషల్ ఉంది అన్నట్టుగా బజ్ క్రియేట్ చేస్తున్నారు.

సినిమా చూసిన ప్రభాస్

సినిమా చూసిన ప్రభాస్

ఇక సినిమాలో దాదాపు అన్ని ఎపిసోడ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయట. దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమా స్క్రిప్ట్ కోసమే దాదాపు రెండేళ్లు కష్టపడ్డాడు. ఈ సినిమా సెట్స్ పైకి వచ్చిన తర్వాత కూడా చాలా విషయాల్లో మార్పులు చేయాల్సి వచ్చింది. ఇక ఇటీవల సినిమా ఫైనల్ కట్ చూసిన ప్రభాస్ చాలా సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తన సన్నిహితులకు సినిమా చాలా బాగా వచ్చింది అని సంతోషం వ్యక్తం చేశాడట.

12 నిమిషాల కీలక ఎపిసోడ్

12 నిమిషాల కీలక ఎపిసోడ్

యూవీ క్రియేషన్స్ మరోసారి తనకు అభిమానులకు మంచి కానుక ఇవ్వబోతున్నట్లు కూడా స్నేహితులకు చెప్పుకొని సంబరపడినట్లు టాక్ వస్తోంది. ప్రతి సినిమాలో అన్నిటికంటే 12 నిమిషాలు ఎపిసోడ్ చాలా కీలకం అని తెలుస్తోంది. సినిమా రిజల్ట్ ను కూడా అదే మార్చేస్తుందని కూడా అంటున్నారు. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది అంటే సినిమా కలెక్షన్స్ మామూలుగా ఉండదని కూడా చెబుతున్నారు.

Recommended Video

Bimbisara Teaser Review | Tollywood's Future || Filmibeat Telugu
సముద్రం మధ్యలో ప్రభాస్ హీరోయిజం

సముద్రం మధ్యలో ప్రభాస్ హీరోయిజం

సముద్రం మధ్యలో జరిగే 12 నిమిషాల కీలకమైన ఎపిసోడ్ సినిమా కథను ఒక్కసారిగా మలుపు తిప్పేస్తుందట. ప్రేమకు సంబంధించిన సన్నివేశాలతోనే ప్రభాస్ మ్యాజిక్ క్రియేట్ చేస్తారట. కాలంతో పోటీ పడుతూ హీరోయిజాన్ని హైలెట్ చేస్తారని తెలుస్తోంది. అప్పటివరకు ఒక ఎత్తు, ఇక ఆ ఎపిసోడ్ తర్వాత ఈ సినిమా మరో ఎత్తు అనే తరహాలో కొనసాగుతుందట.

అంతేకాకుండా ప్రతి ఫ్రేమ్ లో కూడా దర్శకుడు ప్రేమకు సంబంధించిన సన్నివేశాలను హైలెట్ చేస్తూ ప్రజెంట్ చేశాడట. మరి సినిమా మొత్తంగా అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. జనవరి 7వ తేదీన రాధేశ్యామ్ సినిమా అన్ని భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X