Just In
- 1 hr ago
తెలుగులో ఆ హీరో అంటేనే ఇష్టమన్న రోజా: అలాంటి వాళ్ల వల్లే సినిమాలు చేయట్లేదంటూ!
- 1 hr ago
యంగ్ హీరో అమర్‌పై ఆరియానా ఆరోపణలు: ఏకంగా ఆమె ఇంటికెళ్లి రచ్చ.. నా ప్రాణం అంటూ అలా!
- 2 hrs ago
ప్రముఖ నిర్మాతకు భారీ షాకిచ్చిన నమ్రత శిరోద్కర్: మీ భార్య మిస్టేక్ చేసిందంటూ మహేశ్ బాబుకు ట్వీట్
- 3 hrs ago
పోర్న్ స్టార్‌గా మారిన నోయల్ మాజీ భార్య: ఎస్తర్ నిర్ణయానికి షాకౌతోన్న సినీ ప్రియులు
Don't Miss!
- Sports
రెండోరోజు కూడా బౌలింగ్ చేయని సైనీ.. గాయం పెద్దదేనా?
- News
ఏపీలో వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి?: అష్ట సూత్రాలు విడుదల చేసిన జగన్ సర్కార్
- Automobiles
షూటింగ్ స్పాట్‌కి 12 కి.మీ సైకిల్‌పై వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎందుకో మరి
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాధే శ్యామ్ మూవీ రిలీజ్ ఫిక్స్! ప్రభాస్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్ చిత్రం విడుదలకు సిద్దమవుతున్నది. సాహో తర్వాత ప్రభాస్ సినిమా కోసం ఎదురు చూస్తున్న సినీ ప్రేక్షకులకు నిర్మాతలు శుభవార్తను చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, ప్రసీదా ఉప్పలపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగత తెలిసిందే. ఈ సినిమా రిలీజ్‌ను ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారంటే..

సాహో రిలీజ్ తర్వాత
సాహో తర్వాత ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ చిత్రం లాక్‌డౌన్ కారణంగా విడుదల ఆలస్యమైంది. వాస్తవానికి గతేడాది వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నించారు. కరోనా కారణంగా ఇటలీలో షూట్ ఆగిపోవడం, థియేటర్లు మూత పడటంతో సినిమా విడుదల ఆగిపోయింది.

జనవరిలో ట్రైలర్ ప్లాన్
ఇక సినిమాను త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాన్ని యూవీ క్రియేషన్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. జనవరిలో ట్రైలర్‌ను రిలీజ్ చేయడానికి సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ప్రభాస్ అభిమానులను హుషారెత్తించేందుకు కొద్ది రోజుల్లో నిర్మాతలు అధికారిక ప్రకటన చేయనున్నారు.

ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ ఎప్పుడంటే
అలాగే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న రాధేశ్యామ్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ మొదలైంది. ఈ సినిమాను 2021 మార్చి 30వ తేదీన రిలీజ్ చేయడానికి యువీ క్రియేషన్స్ ప్లాన్ చేసినట్టు తెలిసింది.

తెర ముందు.. తెర వెనుక
నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, సచిన్ ఖేడ్కర్, ప్రియదర్శి పులికొండ, భాగ్య శ్రీ, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, సత్యన్, సాషా చెత్రి తదితరులు
దర్శకత్వం: రాధా కృష్ణ కుమార్
నిర్మాతలు: వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, ప్రసీదా ఉప్పలపాటి
మ్యూజిక్: జస్టిన్ ప్రభాకరన్
సినిమాటోగ్రఫి: మనోజ్ పరమహంస
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్: యూవీ క్రియేషన్స్