Radhe Shyam Twitter Review.. ప్రభాస్, పూజా హెగ్డే కెమిస్ట్రీ సూపర్.. అయితే సెకండాఫ్ అంటూ
ఎన్నో సమస్యలు, ఇబ్బందులను అధిగమించి రాధే శ్యామ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్, తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక షోలు అర్ధరాత్రి నుంచే ప్రారంభమయ్యాయి. ఈ సినిమాపై సోషల్ మీడియాలో ప్రేక్షకులు వెల్లడిస్తున్న అభిప్రాయాలు మీ కోసం
Recommended Video
ఫస్టాఫ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా
రాధే శ్యామ్ సినిమా ఫస్టాఫ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. విక్రమాదిత్య, ప్రేరణ మధ్ లవ్ సీన్లు అద్భుతంగా ఉన్నాయి. ఈ ప్రేమ జంట ప్రపంచాన్ని మాయ చేసింి. ప్రభాస్, పూజా హెగ్డే కెమిస్ట్రీ సూపర్, విజువల్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. డైరెక్టర్ రాధేశ్యామ్, యూనిట్‌కు నా శుభాకాంక్షలు అని నిర్మాత ఎస్‌కేఎన్ ట్వీట్ చేశారు.
లవ్ సీన్లు అద్భుతంగా
ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి బిగ్ కంగ్రాట్స్. రాధేశ్యామ్ ఫస్టాఫ్ సూపర్బ్. లవ్ సీన్లు అద్భుతంగా ఉన్నాయి. థమన్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. డైరెక్టర్ రాధాకృష్ణ స్క్రీన్ ప్లే బ్రిల్లియంట్. జస్టిన్ ప్రభాకర్ సాంగ్స్ టాప్ క్లాస్. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సూపర్బ్ అని ఓ అభిమాని ట్వీట్ చేశాడు.
లవ్ స్టోరి మాస్టర్ పీస్‌గా
రాధేశ్యామ్ లవ్ స్టోరి మాస్టర్ పీస్‌గా అనిపిస్తుంది. ప్రభాస్ అన్నా సూపర్‌గా యాక్టింగ్ చేశాడు. థమన్ బీజీఎం కిర్రాక్. షిప్ సీన్లు చూసేటప్పుడు నేను సీటుకు అతుక్కుపోయాను. వీఎఫ్ఎక్స్ హాలీవుడ్‌ను మించి ఉన్నాయి. డైరెక్టర్ రాధాకృష్ణ హిట్ కొట్టావు అంటూ మరో అభిమాని ట్వీట్ చేశాడు.
చిన్న పాయింట్‌తో గ్రాండియర్‌గా
రాధే శ్యామ్ చిన్న పాయింట్‌తో గ్రాండియర్‌గా తెరకెక్కింది. విజువల్ పరంగా బాగుంది. ఎక్సెలెంట్ సినిమాటోగ్రఫి, బీజీఎం అదిరిపోయింది అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.
ఐటెమ్ సాంగ్స్ లేవు.
రాధే శ్యామ్ సినిమాలో ఊ అంటావా లాంటి ఐటెమ్ సాంగ్స్ లేవు. కేవలం ఈ సినిమా క్లాస్, మాస్ ఆడియెన్స్ కోసం రూపొందింది అంటూ నెటిజన్ ట్వీట్ చేశాడు.
తొలి 20 నిమిషాలు అదిరిపోతుంది.
రాధే శ్యామ్ సినిమాలో తొలి 20 నిమిషాలు అదిరిపోతుంది. విజువల్ ట్రీట్. ఫస్టాఫ్ చాలా బాగుంది. సంచారీ, ఈ రాతలే పాటలు బాగున్నాయి. సెకండాఫ్ కొంచెం స్లో ఉంది. మొత్తంగా ఈ సినిమా చూడదగినది. ఆడియెన్స్ రియాక్షన్స్ బట్టి సినిమా సక్సెస్ ఉంటుంది అని నెటిజన్ ట్వీట్ చేశాడు.
బొమ్మ బ్లాక్ బస్టర్.
రాధే శ్యామ్ బొమ్మ బ్లాక్ బస్టర్. ఈ సినిమాపై నెగిటివ్‌గా ప్రచారం చేసే వాళ్లందరు ఇప్పుడు మాట్లాడండి. ప్రభాస్ సైక్లోన్‌గా మారిపోతున్నాడు. హేటర్స్‌ను తుఫాన్ చుట్టుముట్టబోతున్నది అంటూ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











