Radhe Shyam vs RRR: అంచనాలను అందుకోలేకపోయిన రాజమౌళి.. మరీ ఇంత తక్కువనా?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం భారీ అంచనాలతో సిద్ధమవుతున్న పాన్ ఇండియా సినిమాల సంఖ్య గట్టిగానే ఉంది. తప్పకుండా రానున్న రోజుల్లో టాలీవుడ్ స్థాయి అమాంతంగా పెరిగిపోతుందని చెప్పవచ్చు. ఇక బాక్సాఫీస్ వద్ద లెక్కలు కూడా ఊహించని విధంగా పెరిగిపోతూ ఉంటాయి అని అనిపిస్తోంది. ఒక విధంగా బాలీవుడ్ కంటే ఎక్కువగా భారీ బడ్జెట్ తో తెలుగు సినిమాలు రూపొందుతున్నాయి. ముఖ్యంగా అందరి ఫోకస్ అయితే RRR సినిమా పైనే ఉంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బాహుబలి తర్వాత వస్తుండడంతో దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా సినిమా గ్లింప్స్ మాత్రం అంచనాలకు తగ్గట్లుగా రెస్పాన్స్ అందుకోలేకపోయింది తెలుస్తోంది.

బాలీవుడ్ భారీ స్థాయిలో..
దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత అంతకు మించి అనేలా సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది ప్రతి ఒక్కరి లో కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. ముఖ్యంగా న్నార్త్ లో ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేయాలని అనుకుంటున్నారు అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరో తో పాటు అలియా భట్ కూడా ఉండటంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. అంతేకాకుండా సినిమా బిజినెస్ తో కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

ఇంగ్లీష్ లో కూడా రిలీజ్
ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 900 కోట్ల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఇంగ్లీష్ లో కూడా విడుదల చేయడానికి ఒక ప్రముఖ హాలీవుడ్ సంస్థ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఏకంగా దుబాయ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం నిర్మాత డి.వి.వి.దానయ్య రాజమౌళి తనయుడు కార్తికేయ ఇద్దరు కూడా అందుకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు.

రాధేశ్యామ్ కంటే తక్కువగా
అయితే ఈ సినిమా గ్లింప్స్ సోమవారం విడుదలైన విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ రాదేశ్యామ్ టీజర్ తో పోలిస్తే మాత్రం ఈ సినిమా టీజర్ 24 గంటల్లో అనుకున్నంత స్థాయిలో క్రేజ్ అందుకోలేదని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ టీజర్ యూ ట్యూబ్ లో విడుదలైన 24 గంటల్లో 17.01M వ్యూవ్స్ అందుకుంది. ఇక RRR మాత్రం 12.44M వ్యూవ్స్ మాత్రమే అందుకుంది. ఒక విధంగా ఇద్దరు స్టార్స్ ఉన్న రాజమౌళి సినిమా, రాధేశ్యామ్ సినిమా కంటే తక్కువ వ్యూవ్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఆ విషయంలో కాస్త దగ్గరగా..
అయితే లైక్స్ విషయంలో మాత్రం RRR సినిమా రాధేశ్యామ్ ను దగ్గరలోకి వచ్చేసింది. 24గంటల్లో రాదేశ్యామ్ 991.4K లైక్‌లు అందుకోగా RRR మూవీ 987.7 లైక్‌లు మాత్రమే అందుకుంది. ఒక విధంగా ఈ రికార్డ్ బాగానే ఉన్నప్పటికీ వ్యూవ్స్ ను బట్టి చూస్తే సినిమాపై చాలామంది ఇంకా ఇంట్రెస్ట్ చూపడం లేదని అర్ధమవుతోంది. మరి ఈ విషయంలో చిత్ర యూనిట్ ఎలాంటి ఆలోచనతో ప్రమోషన్ ను కొనసాగిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











