సెక్స్ సీన్ వివాదం: అందులో ఆ హీరో కూడా ఉన్నాడంటున్న రాధిక ఆప్టే!

Recommended Video

Radhika Apte Reacts On The Viral Clip From The Wedding Guest Film || Filmibeat Telugu

బాలీవుడ్ నటి రాధిక ఆప్టే బోల్డ్‌గా నటించడానికి ఏమాత్రం సంకోచించరు. ఎలాంటి సన్నివేశాలైనా అందులో ఇమిడిపోయతారు. స్క్రిప్టు డిమాండ్ చేస్తే నగ్నంగా నటించడానికైనా, శృంగార సీన్లు చేయడానికైనా సై అంటారు. అయితే ఆమె నటించిన ఇలాంటి సన్నివేశాలు సినిమా విడుదలకు ముందే ఇంటర్నెట్లో లీకవ్వడం వివాదాస్పదం అవుతోంది. గతంలో ఇలా చాలా సార్లు జరిగింది. సినిమా పబ్లిసిటీ కోసమే ఇలాంటివి చేస్తున్నారనే వాదన కూడా లేక పోలేదు. ఇటీవల ఆమె దేవ్ పటేల్‌తో కలిసి నటించిన ఓ హాలీవుడ్ సినిమాలో సెక్స్ సీన్ చేశారు. ఇది సోషల్ మీడియాలో లీక్ అవ్వడం హాట్ టాపిక్ అయింది.

లీకైనందుకు కాదు... తన పేరుతో అలా చేస్తున్నందుకే

లీకైనందుకు కాదు... తన పేరుతో అలా చేస్తున్నందుకే

రాధిక ఆప్టే, దేవ్ పటేల్ కలిసి ‘ది వెడ్డింగ్ గెస్ట్' అనే చిత్రంలో నటించారు. ఇందులో ఇద్దరి మధ్య చిత్రీకరించిన ఘాటైన పడకగది సీన్లు లీక్ అయి వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సీన్లు లీకైనందుకు రాధిక బాధ పడటం లేదు. కానీ... అవి ‘రాధిక ఆప్టే సెక్స్ సీన్' అనే క్యాప్షన్‌తో సర్వ్యూలేట్ అవుతుండటంపై ఆమె అప్‌సెట్ అయ్యారు.

ఆ హీరో పేరు ఎందుకు ఎత్తడం లేదంటున్న రాధిక

ఆ హీరో పేరు ఎందుకు ఎత్తడం లేదంటున్న రాధిక

ఈ లీక్ సీన్లపై రాధిక ఆప్టే స్పందించారు. ‘ది వెడ్డింగ్ గెస్ట్' నేను చేసిన అందమైన చిత్రాల్లో ఒకటి. సమాజంలోని సైకో మెంటాలిటీ ఉన్న వ్యక్తుల వల్లే ఇలాంటి సీన్లు బయటకు లీక్ అవుతుంటాయి. ఆ లీకైన సీన్లో రాధిక ఆప్టేతో పాటు దేవ్ పటేల్ కూడా ఉన్నారు. కానీ ఆ సీన్లు నా పేరు మీద మాత్రమే సర్క్యులేట్ అవుతున్నాయి. ఎందుకు ఆ సీన్లను ఆ హీరో పేరు మీద సర్వ్కులేట్ చేయడం లేదు.' అని ప్రశ్నించారు.

గతంలోనూ రాధిక ఆప్టే సీన్లు లీక్

గతంలోనూ రాధిక ఆప్టే సీన్లు లీక్

గతంలోనూ రాధిక ఆప్టే విషయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. 2015లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రాధిక ఆప్టే నటించిన ఓ షార్ట్ ఫిల్మ్‌లోని న్యూడ్ సీన్లు లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత 2016లో ఆదిల్ హుస్సేన్‌తో రాధిక చేసిన న్యూడ్ సెక్స్ సీన్ కూడా ముందే లీకవ్వడం పెద్ద గొడవకు దారి తీసిన సంగతి తెలిసిందే.

లైట్ తీసుకుంటానంటున్న రాధిక

లైట్ తీసుకుంటానంటున్న రాధిక

ఇలాంటి లీక్ సీన్ల విషయం నేను పెద్దగా పట్టించుకోను. వాటి గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న నెగెటివ్ ప్రచారంపై స్ట్రెస్ ఫీలవ్వను. మనుషులు రకరకాల అభిప్రాయాలతో ఉంటారు. నటిగా నేను అన్ని రకాల పాత్రలు, సీన్లు చేయాల్సి ఉంటుంది. దీనిపై అంతపెద్ద రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదంటోంది రాధిక ఆప్టే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X